గూగుల్ పిక్సెల్ వాచ్‌ను కంపెనీ పిక్సెల్ 7 సిరీస్ ఫోన్లతో పాటు లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన మొదటి స్మార్ట్ వాచ్ ఇదే. బెజెల్ లెస్ సర్క్యులర్ డయల్‌ను ఈ ఫోన్‌లో అందించారు. 2 జీబీ ర్యామ్ ఈ వాచ్‌లో ఉంది. 4జీ ఎల్టీఈ వైర్‌లెస్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
గూగుల్ పిక్సెల్ వాచ్ ధర
ఈ వాచ్‌లో వైఫై ఓన్లీ మోడల్ ధర 349.99 డాలర్లుగా (సుమారు రూ.28,700) నిర్ణయించారు. వైఫై ప్లస్ ఎల్టీఈ మోడల్ ధర 399.99 డాలర్లుగా (సుమారు రూ.32,800) ఉంది. ఆబ్సీడియన్, హాజెల్, చాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఇది ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
గూగుల్ పిక్సెల్ వాచ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ వాచ్‌లో అమోఎల్ఈడీ టచ్ డిస్‌ప్లేను అందించారు. ఆల్వేస్ ఆన్ మోడ్ కూడా గూగుల్ పిక్సెల్ వాచ్‌లో ఉంది. 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ద్వారా దీని డిస్‌ప్లేను ప్రొటెక్ట్ చేయనున్నారు. ఎక్సినోస్ 9110 ప్రాసెసర్‌పై ఈ వాచ్ పని చేయనుంది. 2 జీబీ ర్యామ్ కూడా ఇందులో ఉంది.
24 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది. వేర్ ఓఎస్ 3.5 ఆపరేటింగ్ సిస్టంపై గూగుల్ పిక్సెల్ వాచ్ పని చేయనుంది. గూగుల్ అసిస్టెంట్, హెల్త్, ఫిట్‌నెట్ ఫీచర్లను ఫిట్ బిట్ ద్వారా సపోర్ట్ చేయనుంది. హార్ట్ రేట్ సెన్సార్, ఈసీజీ ట్రాకర్ కూడా ఈ వాచ్‌లో అందించారు.
బ్లూటూత్ వీ5.0, 2.4 గిగా హెర్ట్జ్ వైఫై, 4జీ ఎల్టీఈ, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ వాచ్‌లో ఉన్నాయి. ఫైండ్ మై డివైస్ యాప్‌కు ఈ వాచ్ కంపాటిబుల్ కానుంది. 50 మీటర్ల వరకు వాటర్ ప్రెజర్‌ను ఇది తట్టుకోనుంది. 5ఏటీయం వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ద్వారా ఈ సాధ్యం కానుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?