మనం చిన్నప్పటి నుంచి నాన్న దగ్గరనుంచి ఎన్నో బహుమతులను తీసుకుంటూ ఉంటాం. కానీ మనం సంపాదించే వయసు వచ్చాక నాన్నలకు ఏమైనా ఇస్తే నాకెందుకురా ఇవన్నీ అంటూ సున్నితంగా రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం ఫాదర్స్ డేకు ఆయనకు ఉపయోగపడే గిఫ్ట్స్ ఇద్దాం. నాన్నలకు ఉపయోగపడే టెక్ గిఫ్ట్స్ ఇవే...



1. డైసన్ ఎయిర్ ప్యూరిఫయర్
ఈ వయసులో వారికి స్వచ్ఛమైన గాలి చాలా అవసరం. ఈ డైసన్ ఎయిర్ ప్యూరిఫయర్ గాలిలోని 99.95 శాతం పార్టికల్స్‌ను రిమూవ్ చేస్తుంది. దీని ధర రూ.52,990గా ఉంది.


2. వ్యూసోనిక్ టచ్ పోర్టబుల్ మానిటర్
ఈ మానిటర్ స్క్రీన్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్స్, ప్రెజెంటేషన్లు, ఖాళీగా ఉన్న సమయంలో ఎంటర్‌టైన్‌మెంట్‌గా కూడా ఉపయోగపడుతుంది. దీని ధరను రూ.26,699గా నిర్ణయించారు.


3. ఆహారాన్ని ఇష్టపడే తండ్రి కోసం ఊని పిజ్జా ఓవెన్స్
దీని ద్వారా పిజ్జాలు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీన్ని బయటకు తీసుకెళ్లడం కూడా చాలా సులభం. దీని ధర రూ.32,999గా ఉంది.


4. పోలీ స్టూడియో 5
ఈ కెమెరా ద్వారా మీ తండ్రి కొలీగ్స్, మిత్రులు, కుటుంబ సభ్యులతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండవచ్చు. ఈ కెమెరా ధర రూ.7,520గా ఉంది.


5. ప్లే ఫిట్ స్మార్ట్ వాచ్
బడ్జెట్ రేంజ్‌లో బెస్ట్ గిఫ్ట్ అంటే ఇదే. ఇది చూడటానికి కూడా స్టైలిష్‌గా ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే ఏడు రోజుల వరకు ఇది పనిచేస్తుంది. దీని దర రూ.2,999గా ఉంది.


6. ఫాజిల్ జెన్ 6
ఇది ఒక సూపర్ స్టైలిష్ స్మార్ట్ వాచ్. సర్క్యులర్ స్క్రీన్, మెటల్ కేసింగ్, టాక్టైల్ బటన్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫాజిల్ జెన్ 6 వాచ్ ధర రూ.23,995గా ఉంది.


7. ఐరోబోట్ రూంబా
శుభ్రతను ఎక్కువగా ఇష్టపడే నాన్నలకు ఇది ఉపయోగపడుతుంది. ఫోన్ ద్వారానే ఈ స్మార్ట్ వాక్యూమ్ క్లీనర్‌ను కంట్రోల్ చేయవచ్చు. దీని ధర రూ.29,900గా ఉంది.


8. శాంసంగ్ టీ7 టచ్
డేటాను స్టోర్ చేసుకోవడానికి మీ నాన్న ఎక్కువ ఇష్టపడే వారైతే ఈ హార్డ్ డిస్క్ ఆయనకు బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా డేటా ట్రాన్స్‌ఫర్ కూడా వేగంగా జరుగుతుంది. దీని ధర రూ.10,399గా నిర్ణయించారు.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!