మొబైల్ యాక్సెసరీస్‌ను లాంచ్ చేసే యాంబ్రేన్ కంపెనీ మనదేశంలో కొత్త పవర్ బ్యాంక్ లాంచ్ చేసింది. దీని బ్యాటరీ సామర్థ్యం 50000 ఎంఏహెచ్‌గా ఉంది. దీన్ని హైకర్స్, క్యాంపర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ పవర్ బ్యాంక్ డిజిటల్ కెమెరాలు, ల్యాప్‌టాప్‌లను చార్జ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.


యాంబ్రేన్ 50000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ ధర
దీని ధరను రూ.3,999గా నిర్ణయించారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, బ్లూ రంగుల్లో యాంబ్రేన్ 50000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ లాంచ్ అయింది.


యాంబ్రేన్ 50000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్లు
ఇందులో 50000 ఎంఏహెచ్ లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంది. ఇది 20W పవర్ అవుట్‌పుట్‌ను అందించనుంది. తొమ్మిది లేయర్ల చిప్ సెట్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఓవర్ హీటింగ్, షార్ట్ సర్క్యూట్ల నుంచి ఇది కాపాడనుంది. క్విక్ చార్జ్ 3.0 హై స్పీడ్ 2 వే చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.


యాంబ్రేన్ ఇటీవలే వైజ్ రోమ్ స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. ఇందులో 1.28 అంగుళాల సర్క్యులర్ లూసిడ్ డిస్‌ప్లేను అందించారు. 2.5డీ కర్వ్‌డ్ గ్లాస్‌ను ఇందులో ప్రొటెక్షన్ కోసం అందించారు. 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఈ డిస్‌ప్లే అందించనుంది. ఇందులో 100కు పైగా క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. ఐపీ68 స్టాండర్డ్స్ వరకు స్ప్లాష్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. అంటే పొరపాటున నీరు వాచ్ మీద పడ్డా ఏం కాదన్న మాట.


హార్ట్ రేట్ ట్రాకింగ్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్, ఎస్‌పీఓ2 ట్రాకర్, మెన్‌స్ట్రువల్ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్ ఫీచర్లు కూడా ఈ స్మార్ట్ వాచ్‌లో అందించారు. దీంతోపాటు వెదర్ ఫోర్‌కాస్ట్, ఫిమేల్ హెల్త్ ట్రాకర్, హై ఏఆర్ అలెర్ట్, బ్రీత్ ట్రైనింగ్ ఫీచర్లు యాంబ్రేన్ వైజ్ రోమ్ స్మార్ట్ వాచ్‌లో ఉన్నాయి. 60కి పైగా స్పోర్ట్స్ మోడ్స్‌‌ను కంపెనీ ఇందులో అందించింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లను ఇది సపోర్ట్ చేయనుంది.


రెండు గంటల పాటు చార్జింగ్ పెడితే ఈ స్మార్ట్ వాచ్ ఏకంగా 10 రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ ఇవ్వనుంది. 260 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఈ స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ మైక్ కూడా ఉంది. ఇది బ్లూటూత్ కాలింగ్స్‌ను సపోర్ట్ చేయనుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఇన్ కమింగ్ కాల్స్, టెక్స్ట్ మెసేజెస్‌లను మీకు నోటిఫై చేసే స్మార్ట్ నోటిఫికేషన్ ఫీచర్ ఇందులో ఉంది. అలాగే వాయిస్ అసిస్టెంట్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!