బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసే ఐటెల్ మనదేశంలో స్మార్ట్ వాచ్‌ల విభాగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. మొట్టమొదటగా 1ఈఎస్ అనే స్మార్ట్ వాచ్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 15 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది. హెల్త్ ఫీచర్లు కూడా ఇందులో చాలా ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టంలను ఇది సపోర్ట్ చేయనుంది.
ఐటెల్ 1ఈఎస్ ధర
దీని ధరను కంపెనీ రూ.1,999గా నిర్ణయించింది. ఈ స్మార్ట్ వాచ్‌పై కంపెనీ ఒక సంవత్సరం వారంటీని కూడా అందించనుంది. ఆన్‌లైన్‌లో ఈ స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఐటెల్ 1ఈఎస్ స్పెసిఫికేషన్లు
ఇందులో 1.7 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉంది. డిజిటల్ క్రౌన్ డిజైన్‌తో ఈ వాచ్‌ను రూపొందించారు. బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, హార్ట్ రేట్ మానిటర్, మెడిటేటివ్ బ్రీతింగ్ మోడ్ వంటి ఫీచర్లు ఇందులో అందించారు.
స్లీప్ ట్రాకింగ్ ఫీచర్‌తో పాటు వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, యోగా వంటి స్పోర్ట్స్ మోడ్స్‌ను ఐటెల్ ఈ వాచ్‌లో అందించింది. ఈ స్మార్ట్ వాచ్‌లో ఇన్‌బిల్ట్ మ్యూజిక్, కెమెరా కంట్రోల్స్ ఉన్నాయి. దీంతోపాటు ఫొటోలు తీసుకోవచ్చు, ప్లే లిస్ట్‌లను కంట్రోల్ చేయవచ్చు.
స్మార్ట్ నోటిఫికేషన్ ఫీచర్ ద్వారా వినియోగదారులు మెసేజెస్, ఈమెయిల్స్, సోషల్ మీడియా అలెర్ట్స్, అలారం క్లాక్స్, కాలెండర్ అలెర్ట్స్ పొందవచ్చు. ఇందులో థండర్ బ్యాటిల్‌షిప్, యంగ్ బర్డ్, 2048 వంటి గేమ్స్ కూడా ఉన్నాయి.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!