Washing Machines: మార్కెట్లో ప్రధానంగా రెండు మోడళ్ల వాషింగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. అవే ఫ్రంట్-లోడ్, టాప్-లోడ్ మెషీన్లు. ఈ రెండు మోడల్స్ బట్టల నుండి మురికిని సమర్థవంతంగా తొలగిస్తాయి. కానీ వీటిలో ఉపయోగించే టెక్నాలజీ, క్లీనింగ్ పూర్తిగా భిన్నంగా ఉంటాయి. దీంతో నీటి వినియోగం, కరెంట్ వాడకం, బట్టల సెఫ్టీ, ఉతికే సమయంలో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. మోటార్ నుండి నీటి వరకు ఈ రెండు మెషీన్లు ఎలా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Continues below advertisement

డ్రమ్‌ పనితీరు 

ఫ్రంట్-లోడ్ మెషీన్: ఇందులో బట్టలను ఫ్రంట్‌లో ఉండే డోర్ ద్వారా లోపలికి వేస్తారు. డ్రమ్ తిరుగుతున్నప్పుడు బట్టలు పైకి, కిందకు తిరుగుతాయి. ఈ గ్రావిటేషనల్ డ్రాప్  వల్ల బట్టల దారాల్లోని మురికి సులభంగా తొలగిపోతుంది. దీనికి చాలా తక్కువ నీరు అవసరమవుతుంది.

టాప్-లోడ్ మెషీన్: ఈ మోడల్ మెషీన్లలో బట్టలను పై నుండి లోడ్ చేస్తారు. ఇవి మెయిన్‌గా రెండు పద్ధతుల్లో ఉంటాయి. మొదటిది 'అజిటేటర్' పద్ధతి, ఇందులో డ్రమ్ మధ్యలో ఉండే ఒక స్పిండిల్ బట్టలను తిప్పుతుంది. రెండోది 'ఇంపెల్లర్' విధానం.. ఇందులో అడుగు భాగంలో ఉండే చక్రం బట్టలు ఒకదానికొకటి రుద్దుకునేలా తిప్పుతుంది. అజిటేటర్ మెషీన్లు బట్టలపై కాస్త ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి.

Continues below advertisement

నీటి వాడకంలో భారీ తేడా

నీటి ఆదా విషయంలో ఫ్రంట్-లోడ్ మెషీన్‌లు ఎంతో ముందున్నాయి. సాధారణంగా ఫ్రంట్-లోడ్ మెషీన్ ఒక్కో వాష్‌కు కేవలం 40 నుంచి 50 లీటర్ల నీరు అవసరం అవుతుంది. దీంతో పోలిస్తే, ఒక సంప్రదాయ టాప్-లోడ్ మెషీన్ సుమారుగా 120 నుంచి 150 లీటర్ల నీటిని పీల్చుకుంటుంది. ఇక ఇంపెల్లర్ ఉన్న టాప్-లోడ్ మెషీన్లు సుమారు 80 నుంచి 100 లీటర్ల నీటిని వాడతాయి. అయితే వాస్తవానికి ఇది మెషీన్ సామర్థ్యం, వాష్ ప్రోగ్రామ్‌ను బట్టి మారుతుంటుంది.  Also Read: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు

స్పిన్ స్పీడ్, ఆరబెట్టడం

బట్టలను పిండే విషయంలో స్పిన్ స్పీడ్ చాలా కీలకం. ఫ్రంట్ లోడ్ మెషీన్‌ల స్పిన్ స్పీడ్ సాధారణంగా నిమిషానికి 1,400 నుంచి 1,600 ఆర్‌పీఎం వరకు ఉంటుంది. టాప్-లోడ్ మెషీన్‌లలో ఇది సుమారు 600 నుండి 800 ఆర్‌పీఎం వరకే పరిమితమై ఉంటుంది. ఫ్రంట్-లోడ్ మెషీన్లలో ఉండే అత్యధిక స్పిన్ స్పీడ్ బట్టలలోని తేమను పూర్తిగా పిండేస్తుంది. దీంతో బట్టలు చాలా తక్కువ సమయంలో ఆరిపోతాయి. మరోవైపు, కొన్ని టాప్ లోడ్ మోడల్స్ బట్టలు ఉతికే ప్రాసెస్ స్పీడుగా ముగిస్తాయి.   Also Read: ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి