Free Fire Max: ఫ్రీ ఫైర్ మాక్స్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ గేమ్స్‌లో ఒకటి. ముఖ్యంగా బాటిల్ రాయల్ గేమ్స్ గురించి మాట్లాడినట్లయితే బీజీఎంఐ తర్వాత ఫ్రీ ఫైర్ మాక్స్‌ను అత్యంత ప్రజాదరణ పొందిన గేమ్‌గా చెప్తారు. దీనికి చాలా కారణాలున్నాయి. అందులో లభించే గొప్ప గేమింగ్ వస్తువులు కూడా ఒక కారణం.


ఫ్రీ ఫైర్ మాక్స్‌లో ఫ్రీగా లభించే వస్తువులు ఇవే...
ఈ గేమ్‌లో బండిల్స్ కూడా చాలా ప్రత్యేకమైన అంశం. ప్రజలు వీటిని పొందడానికి చాలా డబ్బు ఖర్చు చేయాలి. కానీ కొన్నిసార్లు ‘గరేనా’ వాటిని ఉచితంగా పొందే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఈరోజు కూడా మీకు అలాంటి అవకాశం ఉంది. మీరు ఎస్‌ప్రిట్ రోడ్‌స్ప్రింటర్ బండిల్‌ను ఉచితంగా పొందవచ్చు. 


ఫ్రీ ఫైర్ మాక్స్‌ ఆడే గేమర్‌లు నేడు అంటే 2024 అక్టోబర్ 7వ తేదీన ఎస్‌ప్రిట్ రోడ్‌స్ప్రింటర్ బండిల్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంది. దీని కోసం గేమర్స్ ఒక్క డైమండ్ కూడా ఖర్చు చేయనవసరం లేదు. కానీ ఒక మిషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ మిషన్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే


ఏమి చేయాలి?
బీఆర్ ర్యాంక్ మోడ్‌లో, మీరు కనీసం 1000 మీటర్లు పరుగెత్తాలి.
మీరు స్నేహితులతో కనీసం 3 మ్యాచ్‌లు ఆడాలి.
ఈరోజు కనీసం ఒక్కసారైనా లూట్‌డ్రాప్‌ని లూట్ చేయాలి.
మీరు తప్పనిసరిగా బూయాను నమోదు చేసుకోవాలి అంటే సీఎస్ ర్యాంక్ మ్యాచ్‌లో కనీసం ఒక్కసారైనా గెలవాలి. 


టాస్క్ పూర్తి చేయడం ఎలా?
ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లో ఫ్రీ ఫైర్ మాక్స్‌ని ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత మీరు ఎడమ మూలలో కనిపించే న్యూబీ మిషన్‌పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు చెక్‌లిస్ట్‌ని తనిఖీ చేయండి. అందులో ఇచ్చిన మిషన్‌లను చదవండి. గేమ్ ఆడి వాటిని పూర్తి చేయండి.
మిషన్‌లో పేర్కొన్న అన్ని పనులను పూర్తి చేసిన తర్వాత మీరు మళ్లీ న్యూబీ మిషన్ విభాగానికి వెళ్లాలి.
ఇప్పుడు మీకు క్లెయిమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
ఆ తర్వాత మీరు ఎస్ప్రిట్ రోడ్‌స్ప్రింటర్ బండిల్‌ను రివార్డ్‌గా పూర్తిగా ఉచితంగా పొందుతారు. 



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?