ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటరోలా సరికొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మోటో రేజర్ పేరుతో ఫోల్డబుల్ ఫోన్ ను విడుదల చేసిన కంపెనీ, ఇప్పుడు రోలబుల్ ఫోన్ పై ప్రయత్నిస్తోంది. Lenovo Tech World 2022 ఈవెంట్ లో భాగంగా Motorola తన లేటెస్ట్ ప్రాజెక్టుకు సంబంధించి వివరాలను వెల్లడించింది.


రోలబుల్ డిస్ ప్లేపై మోటరోలా ప్రయోగాలు


Motorola 5 - అంగుళాల స్క్రీన్‌ను 6.5 అంగుళాల డిస్‌ప్లేగా మార్చడానికి నిలువుగా రోల్ చేయడానికి అవసరమైన పద్ధతులను టెస్ట్ చేస్తున్నది. స్క్రీన్ రోలింగ్ కు సంబంధించి ఫోన్ లో ఒక బటన్ ను అందిస్తుంది.  5-అంగుళాల నుంచి 6.5-అంగుళాల స్క్రీన్‌కు మారితే కంటెంట్ దాని పరిమాణాన్ని సజావుగా పెంచుతుందని వెల్లడించింది. రోల్ చేయదగిన ఫోన్ కు సంబంధించి ప్రస్తుత స్థితికి అనుగుణంగా ఇది సరిపోతుందని వెల్లడించింది. ఫోన్ లో వీడియోను చూస్తున్నప్పుడు ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంటెంట్‌ను కూడా పెద్ద స్క్రీన్‌ లో చూసే వెసులుబాటు ఉంటుంది.


కాన్సెప్ట్ దశలోనే రోలబుల్ స్మార్ట్ ఫోన్


Lenovo/Motorola నుంచి రోల్ చేయదగిన స్మార్ట్ ఫోన్ ఇప్పటికీ కాన్సెప్ట్ దశలోనే ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు మార్కెట్లోకి రాబోతుందని అనే విషయాన్ని ఇప్పటికీ వెల్లడించలేదు. వాస్తవానికి, ఒక కాన్సెప్ట్ మోడల్‌ను ఉత్పత్తి దశకు తీసుకురావడంలో విఫలమైన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. ఫోల్డబుల్ ల్యాప్‌ టాప్,  ఫోన్ విభాగంలో లెనోవా/ మోటరోలాకు మంచి బ్యాగ్రౌండ్ ఉన్న నేపథ్యంలో ఈ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చే సత్తా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ప్రయత్నించి విఫలమైన LG  


ఇప్పటికే LG  రోలబుల్ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. రోలబుల్ టీవీలు అందుబాటులోకి తెచ్చిన ఈ కంపెనీ, అదే తరహాలో స్మార్ట్ ఫోన్ ను కూడా తీసుకురావాలి అనుకుంది. ఇందుకు ‘బి’ అనే ప్రాజెక్టును మొదలు పెట్టింది.  కానీ, ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, ఆ ప్రాజెక్టు నుంచి వైదొలగింది. సామ్ సంగ్ నుంచి ఇప్పటి వరకు ఫోల్డబుల్ ఫోన్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. రోలబుల్ ఫోన్లు ప్రయోగం మాత్రం చేయలేదు. మోటరోలా ప్రయత్నం ఎక్కడి వరకు వెళ్తుంది అనే ఇప్పుడే చెప్పలేం. ఇప్పటికే మోటరోలా కంపెనీ ఫోల్డబుల్ OLED స్క్రీన్ టెక్నాలజీలో పెట్టుబడులు పెడుతోంది. ఇది రాబోయే సంవత్సరాల్లో ఫోల్డబుల్ స్పేస్‌లో మంచి అవకాశాలు దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇక మోటరోలా ప్రయత్నమే ఫలిస్తే మీరు, మీ మొబైల్‌ను చుట్ట చుట్టేసి జేబులో పెట్టుకోవచ్చు.


Rea Also : మీ ఇంటర్నెట్ స్పీడ్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? చాలా సింపుల్, జస్ట్ ఇలా చేస్తే చాలు!