Bigg Boss 6 telugu: బిగ్ బాస్ సీజన్ 6‌లో అసలైన ఫిజికల్ టాస్కు ఇదేనని చెప్పుకునేలా ఉంది ప్రోమో చూస్తుంటే. ఇంత వరకు దుస్తులు నలగకుండా, హెయిర్ స్టైల్ చెదిరిపోకుండా ఆడిన వారంతా ఈ రోజు బిగ్‌బాస్ ఇచ్చిన గేమ్‌లో ఒకరి మీద ఒకరు పడి దొర్లుకుంటూ ఆడారు. ముఖ్యంగా గీతూ అయితే గేమ్ పేరుతో తన కన్నింగ్ ఆలోచనలు, మాటలను బయటపెట్టింది. గీతూ చేతిలో బకరాలా మారిన ఆదిరెడ్డి ఆమె ఏం చెబితే అదే చేయసాగాడు. 


ప్రోమోలో ఏముందంటే... కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో ఉండేందుకు ‘చేపల చెరువు’ టాస్కు  ఇచ్చారు బిగ్‌బాస్.చేపలు పైనుంచి పడుతుంటే వాటిని పట్టుకుని గంపల్లో వేసి జాగ్రత్తగా దాచుకోవాలి. వీలైనన్ని ఎక్కువ చేపలు పట్టుకున్నవారే కెప్టెన్సీ కంటెండర్లుగా అవుతారు. అయితే  ఇద్దరిద్దరూ టీమ్ గా మారి ఆడినట్టు కనిపించింది. గీతూ- ఆదిరెడ్డి, రాజ్ - ఫైమా జంటలుగా విడిపోయి ఆడారు. ఇక గీతూ తన కన్నింగ్‌నెస్ బయటపెట్టింది. ఆమె చెప్పిందల్లా గంగిరెద్దులా తలాడిస్తూ చేస్తూనే ఉన్నాడు ఆదిరెడ్డి. 


రేవంత్‌ని రెచ్చగొడదాం...
గీతూ ఫిజికల్ టాస్కులో తాను పోటీపడలేనని అర్థమై రేవంత్‌ని రెచ్చగొట్టి కోపం వచ్చేలా చేయాలని ఆదిరెడ్డితో చెబుతూ కనిపించింది. రేవంత్ మాత్రం తన జోలికి ఎవరూ రారంటూ ఇనయాకు చెబుతున్నాడు. ఇక జంటలుగా మారిన ఇద్దరు సభ్యుల్లో ఒకరు గంపలో చేపలను పట్టుకుని కూర్చుంటే, మరొకరు వాటిని కాపాడే ప్రక్రియను, పక్కవాళ్ల గంపల్లోంచి లాక్కుని  తెచ్చే పనిని చేయసాగారు. అలా పక్క వాళ్ల గంపలోనుంచి లాగడం అనేది ఫిజికల్ మారిపోయింది. మగవారంతా ఒకరిపై ఒకరు పడి లాక్కుని, పీక్కుని, కిందామీదా అయ్యారు. 


అందరి గేమ్‌లో తలదూరుస్తూ, అందరి విషయాల్లో మధ్యలో వస్తూ, అందరూ తన టార్గట్ అని చెప్పే గీతూ మాత్రం బాలాదిత్యకు నీ గేమ్ నువ్వాడుకో అంటూ నీతులు చెబుతోంది. ఈ గేమ్ లో అందరూ గీతూ  ఆదిరెడ్డిని టార్గెట్ చేసినట్టు కనిపించింది. వాళ్లిద్దరి దగ్గర ఉన్న చేపలను లాక్కునేందుకు అందరూ ప్రయత్నించారు. అలాగే గీతూ - ఆదిరెడ్డి కూడా మిగతా వాళ్ల గంపల మీద పడి లాక్కోబోయారు. కానీ వారి ప్రయత్నాలను సాగనివ్వలేదు మిగతా ఇంటి సభ్యులు.  సూర్య, రోహిత్, రాజ్, బాలాదిత్య కలిసి ఆదిరెడ్డికి చుక్కలు చూపించారు. ఎప్పుడూ నోరుపారేసుకునే గీతూ పక్కన ఉంటే ఆదిరెడ్డికి కనిపించేవి చుక్కలే. 



జంటపై మండిపడ్డ గీతూ
గీతూ ఓటమిని భరించలేదు. అందరిపై నోరుపారేసుకుంటుంది. ఇప్పుడు కూడా అదే చేసింది. ఆమె గంప నుంచి చేపలు అందరూ లాక్కున్నారు. రోహిత్ కూడా గీతూని టార్గెట్ చేసి ఆడాడు. దానికి గీతూ ‘గట్స్ ఉండాలా గట్స్’ అంటూ చిటికెలు వేస్తూ యాటిట్యూడ్ చూపించింది. దానికి రోహిత్ ‘గట్స్ ఉంటే తీసుకో’ అన్నాడు. దానికి గీతూ ‘ఎప్పుడు చూడు కలిసి ఆడతారు నువ్వు మీ ఆవిడా’ అంటూ అరిచింది. దానికి మెరీనా కూడా గీతూతో గొడవపడింది. ‘నా జోలికి రావద్దు’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. దానికి గీతూ ‘వస్తా వస్తా’ అంటూ రెచ్చగొట్టింది. ‘అందరితో ఆడతా, అందరూ నా టార్గెట్లే’ అంటూ డైలాగులు వేసి గీతూ. వీళ్ల ఆట, గొడవలు చూసి బిగ్‌బాస్ కళ్లు చల్లబడి ఉంటాయి. 


Also read: నువ్వొక పెరుగు దొంగవి, రేవంత్ పై నోరుపారేసుకున్న గీతూ - నామినేషన్స్‌లో అందరూ ఆన్ ఫైర్