సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ డౌన్ అయిందని వందల మంది యూజర్లు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేస్తున్నారు. అయితే మనదేశంలో మాత్రం ఇవి డౌన్ అయినట్లు అనిపించలేదు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల నుంచి గత 24 గంటల్లో మొత్తం 346 మంది ఫేస్‌బుక్ డౌన్ అయిందని తెలిపినట్లు డౌన్ డిటెక్టర్ అనే వెబ్ సైట్ తన కథనంలో పేర్కొంది.
వీరిలో చాలామంది ట్వీటర్‌లో దీనికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఈ ఫొటోల్లో ‘sorry, something went wrong.’ అనే మెసేజ్ కనిపిస్తుంది. దీంతోపాటు ‘We're working on getting this fixed as soon as we can.’ అనే మెసేజ్ కూడా డిస్‌ప్లే అవుతుంది.
ఒక వినియోగదారుడు ‘#Facebook is down. Now I'm forced to do actual work.’ అని ట్వీట్ చేయగా.. మరొకరు ‘Ugh, #facebookdown more often than up. I have time to waste!’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. గత కొన్ని వారాల్లో ఫేస్ బుక్ డౌన్ అవ్వడం ఇది రెండోసారి.
టెక్నాలజీకి సంబంధించిన సమస్యల కారణంగా నవంబర్ 19వ తేదీన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయ్యాయి. డౌన్ డిటెక్టర్ కథనం ప్రకారం.. వేలమంది ప్రజలకు ఈ సోషల్ మీడియా సైట్లతో సమస్య తలెత్తింది. ప్రపంచ నంబర్ వన్ యాప్ వాట్సాప్‌పై కూడా దీని ప్రభావం పడిందని తెలుస్తోంది.