Elon Musk AI Tutor: ఎలాన్ మస్క్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. అతను ఎక్స్ (పాత పేరు ట్విట్టర్), టెస్లా, స్పేస్ఎక్స్ వంటి అనేక పెద్ద, అంతర్జాతీయ కంపెనీలను కలిగి ఉన్నాడు. ఈ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఎంతో మంది కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తారు కూడా. ఎలాన్ మస్క్ ఇప్పుడు ఏఐ ట్యూటర్ జాబ్స్‌ను అందిస్తున్నాడు. ఎలాన్ మస్క్ కంపెనీలో పని చేస్తే మీకు ఎంత జీతం వస్తుంది అనేది ఎవరికి అయినా వచ్చే మొదటి ప్రశ్న. ఇప్పుడు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఎలాన్ మస్క్ కంపెనీలో ఖాళీ...
వాస్తవానికి ఎలాన్ మస్క్ కంపెనీలలో ఒకదానికి ఏఐ ట్యూటర్‌లు అవసరం. ఎలాన్ మస్క్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ ఎక్స్ఏఐ (xAI) కోసం ఏఐ ట్యూటర్‌లను వెతుకుతున్నాడు. ఎలాన్ మస్క్ ఏఐ కంపెనీలో పనిచేస్తున్న ఏఐ ట్యూటర్‌లు భారతీయ కరెన్సీ ప్రకారం గంటకు రూ. 5000 పొందుతారు.
గత వారం ఎలాన్ మస్క్ కంపెనీ ఎక్స్ఏఐ... ఏఐ ట్యూటర్ల రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటన చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోసం హై క్వాలిటీత డేటాను సిద్ధం చేయడం ఈ ట్యూటర్‌ల పని. తద్వారా లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అల్గారిథమ్‌లను బోధించవచ్చు.
ఈ ఉద్యోగాల దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంగ్లిష్‌తో పాటు కొరియన్, వియత్నామీస్, చైనీస్, జర్మన్, రష్యన్, ఇటాలియన్, ఫ్రెంచ్, అరబిక్, ఇండోనేషియన్, టర్కిష్, హిందీ, పర్షియన్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో ఏదైనా ఒకటి తెలుసుకుని ఉండాలి.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
గంటకు 5,000 రూపాయలు...
ఈ పని కోసం మేము మీకు పైన చెప్పినట్లుగా... ఏఐ ట్యూటర్‌లకు గంటకు 35-65 డాలర్లు అంటే మనదేశ కరెన్సీలో రూ.3,000 నుంచి రూ. 5,400 వరకు చెల్లించనున్నారు. ఇవి రిమోట్ జాబ్స్ అంటే ఇంటి దగ్గర నుంచి పని చేయవచ్చు. అంతే కాకుండా ఫుల్ టైమ్ కూడా.
ఎలోన్ మస్క్ xAIని వేగంగా అభివృద్ధి చేయడం, దానికి విశ్వం గురించి అవగాహనను పెంచడం, మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీని కోసం అతను సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో తన జనరేటివ్ ఏఐ ప్రోగ్రామ్ గ్రోక్‌ను ప్రారంభించాడు. దీనిలో డేటా ట్రైనింగ్ కోసం పబ్లిక్ ట్వీట్‌లు ఉపయోగపడతాయి.
అయినప్పటికీ ఆంగ్లేతర భాషల కోసం డేటా ఆనోటేటర్లను వేగంగా రిక్రూట్ చేస్తున్న మొదటి కంపెనీ ఇది కాదని మీకు తెలియజేద్దాం. అంతకుముందు, బెంగాలీ, ఉర్దూ వంటి భాషలలో 60 కంటే ఎక్కువ ఉద్యోగాల కోసం స్కేల్ ఏఐ కూడా ప్రకటనలు చేసింది. ఎందుకంటే ఈ భాషలకు సంబంధించి ఇంటర్నెట్‌లో తక్కువ రిటెన్ కంటెంట్ ఉంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే