Elon Musk Introduces Grok Imagine: ఎక్స్‌ఏఐ (xAI) స్థాపకుడు ఎలాన్ మస్క్, తన AI ప్లాట్‌ఫామ్ గ్రోక్‌కు కొత్త అప్‌గ్రేడ్‌ను ప్రవేశపెట్టారు. 'గ్రోక్ ఇమాజిన్ v0.9' అనే ఈ ఫీచర్ , టెక్స్ట్, ఇమేజ్‌లు, వీడియోలను క్వాలిటీగా, వేగవంతంగా జెనరేట్ చేయగలదు. ఓపెన్‌ఏఐ సోరా 2 లాంచ్ తర్వాత ఈ ప్రకటన వచ్చింది. AI కంటెంట్ క్రియేషన్ లో పోటీ పడుతున్న కంపెనీలు పోటాపోటీగా కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి తెస్తున్నాయి. X లో మస్క్ పోస్ట్‌లు, నెటిజన్లను ఆకట్టుకుని, వారు సృజనాత్మక వీడియోలు, ఇమేజ్‌లను షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 5న Xలో పోస్ట్ చేసిన మస్క్, "గ్రోక్ ఇమాజిన్ v0.9 – అతి వేగవంతమైన టెక్స్ట్, వీడియో, ఇమేజ్ జెనరేషన్" అని పేర్కొన్నారు. ఈ అప్‌డేట్, మునుపటి వెర్షన్‌ల కంటే వేగంగా 15 సెకన్లలోపు కంటెంట్‌ను సృష్టించగలదు. xAI ఈ కొత్త టూల్, యూజర్లకు రియల్-టైమ్ క్రియేషన్ అనుభవాన్ని అందిస్తుంది. ఓపెన్ ఏఐ సోరా 2 తో పోల్చితే, గ్రోక్ వేగం , క్వాలిటీపై దృష్టి పెట్టింది.
గ్రోక్ ఇమాజిన్ v0.9లో ముఖ్య మార్పులు:- ఇన్‌స్టంట్ జెనరేషన్ : టెక్స్ట్, ఇమేజ్, వీడియోలు 15 సెకన్లలో సిద్ధం.- గ్రోక్ 4 ఫాస్ట్ *: హైబ్రిడ్ టెక్స్ట్ మోడల్, AI వర్క్‌ఫ్లోలను వేగవంతం చేస్తుంది.- ఫాస్ట్ ఇమేజ్ క్రియేషన్ : స్క్రోల్ చేస్తుంటే ఇమేజ్‌లు రియల్-టైమ్‌లో కనిపిస్తాయి.- అల్ట్రా-ఫాస్ట్ వీడియో : క్లిప్‌లు సెకన్లలో రెండర్ అవుతాయి.- వాయిస్-ఫస్ట్ ఇంటర్‌ఫేస్ : సెట్టింగ్స్‌లో "ఓపెన్ అప్ ఇన్ వాయిస్ మోడ్" ఆన్ చేస్తే, స్పీచ్‌తో ఇంటరాక్ట్ చేయవచ్చు – టైపింగ్ అవసరం లేదు.
ఈ ఫీచర్లు, క్రియేటర్లు, ప్రొఫెషనల్స్, సాధారణ యూజర్లకు హ్యాండ్స్-ఫ్రీ అనుభవాన్ని అందిస్తాయి.
Xలో షేర్ చేసిన మస్క్, "అతి వేగవంతమైన టెక్స్ట్ జెనరేషన్ – గ్రోక్ 4 ఫాస్ట్. వీడియో జెనరేషన్ 15 సెకన్లలో – గ్రోక్ ఇమాజిన్. ఇమేజ్‌లు ఇన్‌స్టంట్‌గా కనిపిస్తాయి" అని పేర్కొన్నారు. "2026 చివరి నాటికి గ్రోక్ AI మూవీ తయారు చేస్తుంది . మరో సంవత్సరం తర్వాత గొప్ప AI గేమ్ వస్తుంది" అని చెప్పారు. xAI , ఓపెన్‌ఏఐ మధ్య లీగల్ డిస్ప్యూట్‌లు కూడా కొనసాగుతున్నాయి – మస్క్, ఓపెన్‌ఏఐ , ఆపిల్‌పై మోనోపొలీ కేసు చేశారు.