Gmail to Zoho Mail:  కేంద్ర హోం మంత్రి అమిత్ షా Zoho Mailని బహిరంగంగా ప్రశంసించిన తర్వాత, ఈ భారతీయ ఇమెయిల్ సర్వీస్ వేగంగా ప్రజాదరణ పొందుతోంది. గోప్యతపై పెరుగుతున్న అవగాహన మధ్య, ఇప్పుడు చాలా మంది వినియోగదారులు Gmailని వదిలి Zoho Mail వైపు మొగ్గు చూపుతున్నారు. ఎలాంటి ప్రకటనలు లేకుండా నడిచే ఈ ఇమెయిల్ సర్వీస్ దాని భద్రత, క్లీన్‌ ఇంటర్‌ఫేస్, ప్రొపెషనల్‌ఫీచర్స్‌ కారణంగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటోంది.

Continues below advertisement

Zoho Mail వ్యక్తిగత వినియోగదారుల కోసం మాత్రమే కాకుండా, చిన్న వ్యాపారాలు, టీమ్స్‌ కోసం కూడా ప్రత్యేకంగా కొన్ని ఫీచర్స్ తీసుకొచ్చారు. ఇది వెబ్, మొబైల్,  IMAP/SMTP మద్దతుతో వస్తుంది. దీనితో పాటు కాంటాక్ట్స్, క్యాలెండర్. టీమ్ సహకారం వంటి అనేక టూల్స్‌ Zoho Workplace ద్వారా ఇంటిగ్రేటెడ్ రూపంలో లభిస్తాయి.

ఎందుకు Zoho Mail ప్రజాదరణ పెరుగుతోంది?

Zoho Mail అతిపెద్ద బలం వినియోగదారు గోప్యత. ప్రకటన రహిత సర్వీస్. ఇక్కడ మీరు Gmail లాగా ప్రకటనలు రావు. అలాగే, ఈ సర్వీస్ దాని డొమైన్ నుంచి కస్టమ్ ఇమెయిల్ చిరునామాలను రూపొందించడానికి ఒక సౌకర్యాన్ని అందిస్తుంది, ఇది ప్రొఫెషనల్‌ యూజర్లకు, చిన్న వ్యాపారాలకు ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. తక్కువ ధరలో ప్రీమియం స్థాయి భద్రత, వృత్తిపరమైన సాధనాల కారణంగా, ఈ ప్లాట్‌ఫాం వేగంగా Gmailకి బలమైన ప్రత్యామ్నాయంగా మారుతోంది.

Continues below advertisement

Gmail నుంచి Zoho Mailకి ఎలా మారాలి?

మీరు Gmail నుంచి Zoho Mailకి మారాలనుకుంటే, ఈ ప్రక్రియ చాలా సులభం . ఇందులో మీ ముఖ్యమైన డేటా, అంటే ఇమెయిల్ లేదా కాంటాక్ట్‌లు ఏవీ కోల్పోరు కూడా. దిగువ ఇచ్చిన స్టెప్స్‌ను ఫాలో అవ్వండి.  

Zoho Mail ఖాతాను ఎలా క్రియేట్ చేయాలి?

ముందుగా Zoho Mail వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. మీ అవసరాలకు అనుగుణంగా ప్లాన్‌ను ఎంచుకోండి. మీరు కస్టమ్ డొమైన్‌ను ఉపయోగించాలనుకుంటే, వ్యాపారం లేదా కార్యాలయ ప్లాన్‌ను ఎంచుకోండి. ఇక్కడ మీరు మీ డొమైన్‌ను యాడ్ చేయవచ్చు. ధృవీకరించవచ్చు, అలాగే మీ టీం కోసం ఖాతాను క్రియేట్ చేయవచ్చు. 

Gmailలో IMAPని ఆన్ చేయండి

మీ Gmail ఖాతాకు లాగిన్ అవ్వండి, Settings → See all settings → Forwarding and POP/IMAP విభాగంలోకి వెళ్లండి. ఇక్కడ IMAPని ఎనేబుల్ చేయండి. ఇది Zoho Mail మీ Gmail డేటాను యాక్సెస్ చేయడానికి, మీ సమాచారాన్ని ట్రాన్స్‌ఫర్ చేయడానికి వీలు కల్పిస్తుంది.  

ఇమెయిల్- కాంటాక్ట్‌లను ఇంపోర్ట్‌ చేయండి

Zoho Mail Settings → Import/Export విభాగంలోకి వెళ్లి Migration Wizardని ఉపయోగించండి. ఇక్కడ నుంచి మీరు మీ అన్ని ఇమెయిల్‌లు, ఫోల్డర్‌లు కాంటాక్ట్‌లను Gmail నుంచి Zoho Mailకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు.

ఇమెయిల్ ఫార్వార్డింగ్‌ను సెట్ చేయండి

మీరు మీ Gmailకి వచ్చే కొత్త సందేశాలు కూడా Zoho Mailలో రావాలని కోరుకుంటే, Gmail Settings → Forwardingకి వెళ్లి మీ కొత్త Zoho Mail IDని జోడించి ఫార్వార్డింగ్‌ను యాక్టివేట్ చేయండి.