AI To SI: గూగుల్, మెటా, ఓపెన్‌ఏఐ, ఎన్విడియా వంటి ప్రముఖ టెక్ దిగ్గజాలతో సమావేశమైన అనంతరం, ఆర్టికల్ ఇంటెలిజెన్స్ (AI)ను "సూపర్ ఇంటెలిజెన్స్" (SI)గా పేరు మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపింది. ఈ పేరు మార్పు చట్టపరంగా, రాజకీయంగా ఒక ముందడుగులా అనిపించినప్పటికీ.. సాంకేతిక, భద్రతా ప్రమాణాల నుండి ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. అదేమిటంటే, AI పేరును SIగా మార్చడం వల్ల దాని నిజమైన ప్రమాదాలు వాస్తవంగా తగ్గుతాయా? అనే ప్రశ్నలు తలెత్తాయి.
పేరు మార్పుతో ఏమి మారుతుంది?
సాంకేతికత అపారమైన శక్తి, సామర్థ్యం, ప్రపంచ ఆధిపత్యాన్ని సూచించడానికి "సూపర్ ఇంటెలిజెన్స్" అనే పదాన్ని ఉపయోగించవచ్చు. నిపుణులు, పెట్టుబడిదారులకు ఇది కేవలం ఒక సాధారణ సాంకేతికత కాదని, మానవ సామర్థ్యాన్ని అధిగమించే ఒక కొత్త విప్లవమని తెలియజేస్తుంది. అయితే, కేవలం పేరు మార్చడం వల్ల కోడ్, మెయిన్ అల్గోరిథం అలాగే ఉంటాయి. న్యూరల్ నెట్‌వర్క్ నిర్మాణం, శిక్షణ డేటా, స్వయంప్రతిపత్తి లేదా మెషిన్ లెర్నింగ్ లో ఎలాంటి మార్పు ఉండదు. దీనిని ఆర్టిఫిషీయల్ లేదా సూపర్ ఇంటెలిజెన్స్ అని పిలిచినా, యంత్రాల నిర్ణయ వేగం, ఆటోమేషన్, భారీ పరిమాణంలో డేటాను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఒకే విధంగా కొనసాగుతాయని నిపుణులు అంటున్నారు. కేవలం పేరు మార్చడం వల్ల ప్రమాదం తగ్గుతుందని భావించడం తప్పుడు భ్రమ మాత్రమే అంటున్నారు. Also Read: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
సూపర్ ఇంటెలిజెన్స్
సూపర్‌ఇంటెలిజెన్స్ వల్ల కలిగే ముప్పులను కేవలం ఊహాజనితమైనవిగా కొట్టిపారేయలేమని నిపుణులు అంటున్నారు. వాటిని ప్రధానంగా వివిధ కోణాల్లో పరిశీలించాల్సి ఉంటుంది. ఒక వ్యవస్థ మానవ ఆలోచనను అధిగమించిన కొద్దీ, దాని ప్రాథమిక లక్ష్యాలను మానవ విలువలతో బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో వాటిని నిలిపివేసే సామర్థ్యాన్ని హ్యూమన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది.
మానవ ప్రమేయం లేకుండా దాడి చేయగల ఆటోమేటెడ్ ఆయుధాలు, డీప్‌ఫేక్‌లు, ఆడియో క్లోనింగ్‌ల ద్వారా ఎన్నికలను ప్రభావితం చేయడం ఈజీ అవుతుంది. అలాగే, గ్రిడ్లు, బ్యాంకింగ్ వ్యవస్థలపై సైబర్‌దాడుల ముప్పు పెరుగుతుంది. శారీరక శ్రమతో పాటు కోడింగ్, రైటింగ్, న్యాయ సమీక్ష వంటి "వైట్-కాలర్" ఉద్యోగాలు ఆటోమేషన్‌కు గురై నిరుద్యోగానికి దారితీస్తాయి. టెక్ కంపెనీలు బలం పుంజుకుని ప్రపంచ అసమానతలు పెరుగుతాయి. యంత్రాల తప్పుడు సమాచారాన్ని నిజమని నమ్మడం వల్ల వైద్య, న్యాయ రంగాల్లో ప్రాణాంతక పరిస్థితులు ఎదురుకావచ్చు. కాలక్రమేణా ఇది మానవ ఇంటెలిజెన్స్ ను బలహీనపరుస్తుంది. Also Read: ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ అదిరిపోయే అప్‌డేట్.. ఐఫోన్ లాంటి కొత్త డిజైన్!
కృత్రిమ మేధస్సు (AI) పేరును “సూపర్ ఇంటెలిజెన్స్” (SI)గా మార్చడం రాజకీయ లేదా చర్చల దృష్టిని మార్చవచ్చు కానీ అది ఆ సాంకేతికతతో ముడిపడి ఉన్న ఏ వాస్తవ ప్రమాదాలనూ తొలగించదు. ఈ వ్యవస్థలను మనం ఎంత సురక్షితంగా, పారదర్శకంగా, నైతికంగా, జవాబుదారీగా తీర్చిదిద్దుతామనే దానిలోనే అసలైన సవాలు ఉంది. ప్రమాదాన్ని నివారించడానికి కేవలం పేర్లు మార్చడం సరిపోదని, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు, కఠినమైన సాంకేతిక నియంత్రణ అత్యవసరంగా అవసరమని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. Also Read: మీ ఫోన్ "నో సర్వీస్" అని చూపిస్తుందా?.. సిమ్ మార్చే ముందు ఈ సెట్టింగ్‌లను చెక్ చేయండి!
