Water Based Battery: బ్యాటరీ టెక్నాలజీ రంగంలో చైనా శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారు. గ్లోబల్ ఎనర్జీ స్టోరేజ్ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే సరికొత్త వాటర్ బేస్డ్ బ్యాటరీని (Water based Battery) అభివృద్ధి చేశారు. ల్యాబ్ టెస్టుల్లో ఈ బ్యాటరీ ఏకంగా 120,000 ఛార్జింగ్ సైకిల్స్‌ను తట్టుకుని అద్భుతమైన పనితీరు కనబరిచింది. దీనిని గ్రిడ్ నిల్వ కోసం ఉపయోగిస్తే సుమారు 300 ఏళ్ల పాటు పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
వాటర్ బేస్డ్ బ్యాటరీ ప్రత్యేకతలు
ఈ బ్యాటరీ కేవలం నార్మల్ వాటర్‌తో పనిచేసేది కాదు. దీనిని 'ఆక్వియస్ బ్యాటరీ' అని పిలుస్తారు. ఇందులో సుమారు 7 pH ఉన్న మెగ్నీషియం, కాల్షియం వంటి సాల్ట్స్ ఉన్న ప్రత్యేక ఎలక్ట్రోలైట్‌ను వాడారు. ఇది బ్యాటరీ లోపల జరిగే చర్యలను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ డిజైన్‌లో నెగటివ్ ఎలక్ట్రోడ్‌గా కోవలెంట్ ఆర్గానిక్ పాలిమర్ 'హెక్స్ టాడ్ COP'ను ఉపయోగించారు. పాజిటివ్ ఎలక్ట్రోడ్ కోసం 'ప్రష్యన్ బ్లూ అనలాగ్'ను వాడారు.
గ్రిడ్ స్టోరేజ్‌లో ఈ బ్యాటరీని రోజుకు సగటున 1.1 సైకిల్స్ చొప్పున నడిపితే, 1.2 లక్షల సైకిల్స్ సుమారు 300 ఏళ్లకు సమానమవుతాయని అంచనా. అయితే ఇది వాస్తవ లైఫ్ హామీ కాదని, కేవలం ల్యాబ్ పరీక్షల ఆధారిత వచ్చిన అంచనా మాత్రమే. Also Read: ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ అదిరిపోయే అప్‌డేట్.. ఐఫోన్ లాంటి కొత్త డిజైన్!
పర్యావరణ హితం, సెక్యూరిటీ
ఈ టెక్నాలజీ వల్ల పర్యావరణానికి కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇందులో ఉపయోగించే తటస్థ ఎలక్ట్రోలైట్ విషపూరితం కానివి. టోఫు తయారీకి వాడే ఉప్పునీటిని పోలిన మినరల్స్ నుంచి దీనిని సేకరించవచ్చు. లిథియం-అయాన్ బ్యాటరీలతో పోలిస్తే వాటర్ బేస్డ్ బ్యాటరీలకు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువ. కాబట్టి ఎక్కువ స్థాయి ఎనర్జీ స్టోరీజీ ఇది అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. Also Read: మీ ఫోన్ "నో సర్వీస్" అని చూపిస్తుందా?.. సిమ్ మార్చే ముందు ఈ సెట్టింగ్‌లను చెక్ చేయండి!
స్మార్ట్‌ఫోన్లలో వాడుకోవచ్చా?
ప్రస్తుతానికి దీనిని స్మార్ట్‌ఫోన్లు లేదా పోర్టబుల్ గాడ్జెట్లలో వాడటం కష్టమే. వాటర్ బేస్డ్ బ్యాటరీలకు సెక్యూరిటీ, తక్కువ ఖర్చు వంటి ప్లస్ పాయింట్లు ఉన్నప్పటికీ.. తక్కువ బరువు, తక్కువ స్థలంలో భారీ మొత్తంలో శక్తిని నిల్వ చేసే ఎనర్జీ డెన్సిటీ సమస్య ఉంది. ఈ సవాలును అధిగమిస్తే భవిష్యత్తులో టెక్నాలజీ రంగంలో మరో విప్లవం రావడం ఖాయం.
Also Read: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
