AI analyzes Characters: ఈ రోజుల్లో, ఏ చిన్న విషయమైనా ఏఐను అడిగేస్తున్నాం. తమ చదువులు, ఉద్యోగాలు, ఇష్టాయిష్టాలు, రోజువారీ సమస్యల గురించి కూడా చర్చిస్తున్నారు. మీ గత చాట్‌ల ఆధారంగా ఏఐ మీ వ్యక్తిత్వం గురించి అంచనా వేస్తుందా? సమాధానం తెలుసుకోవడానికి, మీరే స్వయంగా ఒక చిన్న ప్రయోగం చేయవచ్చు. మనం AIతో మాట్లాడుతున్నప్పుడు, మన ఆలోచనలను, ప్రవర్తనను తెలియజేసే అనేక విషయాలను అది రికార్డ్ చేస్తుంది. ఉదాహరణకు, మీరు అడిగే ప్రశ్నలు, ఒక సమస్యను మీరు ఎలా పరిష్కరించుకోవాలనుకుంటున్నారు, మీకు ఎంత సమాచారం కావాలి, నిర్ణయాలు తీసుకోవడంలో మీ ప్రాధాన్యతలు ఏమిటి వంటివి. కేవలం ఒకటి లేదా రెండు చాట్‌ల నుంచి వ్యక్తిత్వాన్ని కచ్చితంగా అంచనా వేయడం కష్టం, కానీ సుదీర్ఘ సంభాషణల ద్వారా ఈ నమూనాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ నమూనాలు మీ ప్రవర్తన గురించి అంచనాలు వేయడానికి AIకి సహాయపడతాయి.

Continues below advertisement

ఈ టెస్ట్ చేయండి 

ఒక AI చాట్‌బాట్‌తో మీరు గతంలో అడిగిన గురించి అడగండి. మీ వద్ద పాత చాట్ టెక్స్ట్ ఉంటే, దాన్ని కాపీ చేసి కొత్త చాట్‌లో అడగొచ్చు. ఆ తర్వాత, AIకి మీ వ్యక్తిత్వాన్ని నేరుగా వివరించడానికి బదులుగా, ఇలాంటి ప్రశ్న అడగండి.

"ఈ సంభాషణ ఆధారంగా నా గురించి ఏం ఊహించవచ్చు? నా ఆలోచనా శైలి, నిర్ణయాలు తీసుకునే విధానం, ఇష్టాలు, సంభాషణలను విశ్లేషించండి. చాట్‌ ఆధారంగా మాత్రమే స్పందించండి, మీకు సందేహం ఉన్నచోట ఊహించుకో." దీనిపై ఏఐ స్పందించిన తీరును జాగ్రత్తగా చూడండి. ముఖ్యంగా, మీ సంభాషణలో మీరు ఎప్పుడూ గమనించని నమూనాలను అది గుర్తిస్తుందో లేదో చూడండి.

Continues below advertisement

మీ పాత చాట్‌లను రెండు పార్టులుగా చేయండి. సంభాషణలోని మొదటి భాగాన్ని AIకి అందించి, మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయమని అడగండి. ఆ తర్వాత, దాని అంచనాలు ఎంతవరకు సరిపోతున్నాయో చూడటానికి రెండో పార్టుతో పోల్చండి. 

ఉదాహరణకు, చాట్‌లోని మొదటి భాగాన్ని చూసిన తర్వాత, మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు అనేక ఎంపికలను తూకం వేస్తారని AI చెబితే, అటువంటి నమూనా నిజంగా కనిపిస్తుందో లేదో చూడటానికి సంభాషణలోని రెండో భాగాన్ని చూడండి.

ఏఐ చెప్పే ప్రతీదాన్నీ నమ్మవద్దు

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా కీలకం. ఏఐ ఒక వ్యక్తి వ్యక్తిత్వానికి సంబంధించిన మానసిక పరీక్షను నిర్వహించలేదు. అది మెయిన్‌గా మీ టెక్స్ట్, ప్రశ్నలు, సంభాషణ సరళి నుంచి సాధ్యమయ్యే విషయాలను రాబడుతుంది. మీరు ఒక నిర్దిష్ట అంశం గురించి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతుంటే, మీకు దానిపై ప్రత్యేక ఆసక్తి ఉందని AI భావించవచ్చు. కానీ దీని అర్థం మీ మొత్తం వ్యక్తిత్వం దాని ఆధారంగానే నిర్ణయిస్తుందని కాదు. 

గోప్యత విషయంలో జాగ్రత్త  

పాత చాట్‌లను AI మోడల్‌కు అందించే ముందు, వాటిలో ఎలాంటి వ్యక్తిగత సమాచారం లేదని నిర్ధారించుకోండి. ఫోన్ నెంబర్లు, ఇమెయిల్‌లు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్, వ్యక్తిగత డాక్యుమెంట్లు, మరొక వ్యక్తికి సంబంధించిన ఇతర సున్నితమైన సమాచారాన్ని తొలగించడం ఉత్తమం.