SIM No Service Problem: మీ ఫోన్‌లో సడెన్ గా "నో సర్వీస్" అని కనిపించి, కాల్స్, మెసేజ్‌లు లేదా మొబైల్ డేటా పనిచేయడం ఆగిపోతే, సిమ్ లేదా నెట్‌వర్క్‌లో లోపం ఉందని భావించడం సహజం. అయితే ఎల్లప్పుడూ ఇదే కారణం కావాలని లేదు. కొన్నిసార్లు ఫోన్‌లో సిమ్ సరిగ్గా ఉన్నప్పటికీ, నెట్‌వర్క్ కనెక్షన్ మాయమవుతుంది. ఇలాంటి సమయంలో వెంటనే కొత్త సిమ్ తీసుకోవడం లేదా పదేపదే సిమ్ తీయడం అవసరం లేదు. కొన్ని సాధారణ సెట్టింగ్‌లను చెక్ చేయడం ద్వారా ఈ సమస్యను ఈజీగా పరిష్కరించుకోవచ్చు. 

Continues below advertisement

1. ఎరోప్లేన్ మోడ్‌ను చెక్ చేయండి

కొన్నిసార్లు ఫోన్‌లో ఎరోప్లేన్ మోడ్ అనుకోకుండా ఆన్‌ కావడం వల్ల కనెక్షన్ ఆగిపోతుంది. ముందుగా దాన్ని ఆఫ్ చేసి నెట్‌వర్క్‌ను చెక్ చేయండి. ఒకవేళ అప్పటికే ఆఫ్ చేసి ఉంటే, దాన్ని 10 నుంచి 15 సెకన్ల పాటు ఆన్ చేసి మళ్లీ ఆఫ్ చేయండి. దీనివల్ల ఫోన్ తిరిగి మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతుంది.

2. ఆటోమేటిక్ నెట్‌వర్క్ సెలక్షన్ 

మొబైల్ నెట్‌వర్క్‌కు ఆటోమేటిక్‌గా కనెక్ట్ కాకపోతే, సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'నెట్‌వర్క్ & ఇంటర్నెట్' లేదా 'మొబైల్ నెట్‌వర్క్'ను సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్ నెట్‌వర్క్ సెలక్షన్ ఎనేబుల్ అయిందో లేదో చెక్ చేయండి. అలాగే వేరే నెట్‌వర్క్ మోడ్ కూడా కనెక్షన్‌ను ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని నార్మల్‌కు సెట్ చేయండి.

Continues below advertisement

3. 5G బదులుగా 4G 

వీక్ లేదా అస్థిరమైన 5G కవరేజ్ ఉన్న ప్రాంతాలలో ఫోన్ 5G, 4G మధ్య పదేపదే నెట్ మారుతుంటుంది. ఈ సమయంలో ప్రిఫర్డ్ నెట్‌వర్క్ టైప్‌ను తాత్కాలికంగా 4G లేదా LTEకి మార్చి చూడండి. సిగ్నల్  సమస్య నెట్‌వర్క్ స్విచింగ్‌కు సంబంధించినదని గుర్తించవచ్చు.

4. సిమ్‌ మార్చి,  రీస్టార్ట్  

ఫోన్ ఆఫ్ చేసి సిమ్ కార్డును తీసివేసి, దానిపై ఎలాంటి దుమ్ము లేదా గీతలు లేవని నిర్ధారించుకోండి. ట్రేలో సిమ్ సరిగ్గా పెట్టి ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. eSIM అయితే సెట్టింగ్స్‌లో సిమ్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయవచ్చు. తాత్కాలిక సాఫ్ట్‌వేర్ సమస్యలొస్తే ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం ద్వారా కూడా నెట్‌వర్క్ సమస్య పరిష్కారమవుతుంది. Also Read: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!

5. నెట్‌వర్క్ సెట్టింగ్స్ రీసెట్

ఇతర పద్ధతులన్నీ విఫలమైతే మీ ఫోన్‌లోని నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ను రీసెట్ చేయవచ్చు. దీంతో సేవ్ చేసిన వై-ఫై, బ్లూటూత్, మొబైల్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లు మాత్రమే తొలగిపోతాయి కానీ మీ వ్యక్తిగత డేటా, ఫోటోలు లేదా యాప్‌లకు ఎలాంటి నష్టం జరగదు. కాబట్టి "నో సర్వీస్" రాగానే టెన్షన్ పడకుండా ఈ సెట్టింగ్‌లను పరిశీలించడం ఎంతో బెస్ట్.

Also Read: ఒకే ప్రశ్నకు ChatGPT, Gemini, Claude వేర్వేరు సమాధానాలు.. ఇలా ఎందుకు వస్తాయంటే?