మెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. NASA మరో అద్భుతానికి  శ్రీకారం చుట్టారు. ఏదైనా గ్రహశకలం భూమిని ఢీకొట్టేందుకు దూసుకొస్తున్నట్లయితే.. వెంటనే దాన్ని కనిపెట్టి మార్గం మధ్యలోనే దాన్ని ధ్వంసం చేసేందుకు అమెరికా పరిశోధకులు DART(డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ సిస్టమ్) అనే స్పేస్ క్రాఫ్ట్ ను తయారు చేశారు.


మేరీల్యాండ్‌ లారెల్‌ లోని జాన్ హాప్‌కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీ (APL)లో DART స్పేస్‌ క్రాఫ్ట్2ను రూపొందించారు. వాస్తవానికి చాలా గ్రహ శకలాలు మన భూమి చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటాయి. వాటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, భవిష్యత్ లో ఏదైనా ప్రమాదం రావచ్చని ముందే గ్రహించిన శాస్త్రవేత్తలు.. ఈ అంతరిక్ష నౌకను రూపొందించారు. 65 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టడం మూలంగానే డైనోసార్లు అంతరించిపోయాయని పరిశోధకులు చెప్తుంటారు. అలాంటి ముప్పు నుంచి భూమిని కాపాడేందుకే నాసా DART అంతరిక్ష నౌకను రూపొందించింది.   


DART అంటే ఏమిటి?


DART(డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ సిస్టమ్) అనేది భూమిని ఢీకొనేందుకు వచ్చే మార్గంలో ఉన్న ఏదైనా గ్రహశకలాన్ని దారి మళ్లించే లక్ష్యంతో NASA నిర్మించిన అంతరిక్ష నౌక. మేరీల్యాండ్‌లోని లారెల్‌లోని జాన్ హాప్‌కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీ (APL)లో నిర్మించబడిన DART స్పేస్‌క్రాఫ్ట్. భూమిని చేరుకోవడానికి రెడీగా ఆస్టరాయిడ్ వైపు DART స్పేస్‌క్రాఫ్ట్ ప్రయాణిస్తుంది. దాని చుట్టూ చిన్న ఉపగ్రహాన్ని (క్యూబ్‌శాట్) మోహరిస్తుంది. టార్గెట్ చేసిన గ్రహశకలం చుట్టూ తిరుగుతుంది. సమాచారాన్ని సేకరిస్తుంది. డేటా, చిత్రాలను సేకరించిన తర్వాత స్పేస్‌ క్రాఫ్ట్ ఆస్టరాయిడ్‌లోకి దూసుకుపోతుంది. ఆ తర్వాత గ్రహశకలాన్ని బ్లాస్ట్ చేస్తుంది. ఫలితంగా భూమికి జరగబోయే నష్టాన్ని నివారిస్తుంది. 


DART మిషన్ ఏ గ్రహశకలాన్ని ఢీకొట్టబోతోంది?


డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్ పనితీరును పరిశీలించేందుకు నాసా శాస్త్రవేత్తలు సిద్ధం అవుతున్నారు. ఇందుకోసం 'డిమోర్ఫోస్' అనే ఉల్కను టార్గెట్ చేసుకున్నారు. డైమోర్ఫోస్ అనేది బైనరీ గ్రహశకలం వ్యవస్థలో ఒక భాగం. అంటే రెండు గ్రహశకలాలు ఒకదానికొకటి కక్ష్యలో ఉన్నాయి. డిడిమోస్ ప్రధాన గ్రహశకలం కాగా.. డైమోర్ఫోస్ దాని ఉపగ్రహం లాంటిది. 1996లో ఈ గ్రహశకలం మొదటిసారి కనుగొనబడింది. ఈ గ్రహశకలం జంట కొన్ని సంవత్సరాలకు భూ గ్రహం మీదుగా వెళ్తుంది. ఈ నేపథ్యంలో దీని టార్గెట్ గా DART మిషన్ పరీక్ష నిర్వహిస్తున్నారు నాసా శాస్త్రవేత్తలు.


గ్రహశకలం మీద దాడి ఎప్పుడు చేయబోతుందంటే?   


NASAకు సంబంధించిన  DART స్పేస్‌క్రాఫ్ట్ ఇప్పటికే డిమోర్ఫోస్‌ దగ్గరికి వెళ్తున్నది. ఇది గత సంవత్సరం నవంబర్ 24న వాండెన్‌బర్గ్ స్పేస్ఫర్స్ నుంచి SpaceX ఫాల్కన్ 9 రాకెట్‌లో బయల్దేరింది. సెప్టెంబర్ 26న చిన్న డైమోర్ఫోస్ ఉల్కపై దాడి చేయబోతుంది.  DART ఇంపాక్ట్ ఫుటేజీని NASA ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. డైమోర్ఫోస్ గ్రహశకలంతో పోలిస్తే DART స్పేస్‌క్రాఫ్ట్ చాలా చిన్నది అయినప్పటికీ, వ్యోమనౌక 25,000 kmph వేగంతో ప్రయాణిస్తున్న గ్రహశకలాన్ని ఢీకొట్టగలదు. ఈ టెస్ట్ మిషన్  ఫలితం గ్రహ రక్షణ వ్యవస్థలో మొదటి అడుగు కాబోతుంది.


Also Read: మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం ఉండాలంటే ఈ 10 టిప్స్ ఫాలో అవ్వండి!
Also Read: మీ ఆండ్రాయిడ్ ఫోన్ మళ్లీ కొత్తదానిలా పని చేయాలా? ఈ 5 టిప్స్ పాటించండి