DALL-E 3ని ఉపయోగించి అద్భుతమైన ఇమేజెస్ ను క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మన ఆలోచనలకు అనుగుణంగా ఇమేజెస్ ను రూపొందించుకోవచ్చు. అయితే, ఇప్పటి వరకు DALL-E 3ని ఉపయోగించాలంటే కొంత మేర రుసుము చెల్లించాల్సి ఉండేది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు చక్కటి న్యూస్ అందించింది. DALL-E 3 ఇకపై Bing Chatలో లేదా Bing ఇమేజ్ జనరేటర్‌తో ఉచితంగా లభిస్తుందని ప్రకటించింది.
టెక్స్ట్ టు ఇమేజ్ లేటెస్ట్ వెర్షన్
DALL-E 3 అనేది OpenAI ద్వారా రూపొందించబడినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. DALL-E 3 అనేది టెక్స్ట్-టు-ఇమేజ్ మోడల్ తాజా వెర్షన్. ఈ లేటెస్ట్ వెర్షన్ ద్వారా ఇమేజెస్ ను అద్భుతంగా రూపొందించే అవకాశం ఉంటుంది. ఇమేజెస్ లోని ముఖాలు, ముఖ కదలికలు, ఇతర అంశాలను అద్భుతంగా చూపించే అవకాశం ఉంటుంది. మనం అనుకున్న ఇమేజ్ ను అనుకున్నట్లుగా తయారు చేసుకోవచ్చు.
ఇమేజెస్ లో క్వాలిటీ, అదిరిపోయే అవుట్ పుట్
ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్, బింగ్ ఇమేజ్ క్రియేటర్‌లో DALL-E 2 వెర్షన్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు దానికి లేటెస్ట్ వెర్షన్ గా DALL-E 3 వినియోగదారుల ముందుకు వచ్చింది. అయితే, DALL-E 2 లో రూపొందించిన ఇమేజెస్ తో పోల్చితే DALL-E 3తో రూపొందించిన ఇమేజెస్ మరింత కచ్చితత్వాన్ని చూపిస్తున్నాయి. ఇమేజెస్ అవుట్ పుట్ తో పాటు క్వాలిటీలోనూ గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ముఖంలో పలికించాల్సిన భావాలను అద్భుతంగా వచ్చేలా చేస్తుంది.
గతంలో DALL-E 2 తో రూపొందించిన ఇమేజెస్ ను ఇప్పుడు DALL-E 3తో మళ్లీ రూపొందించి పరీక్షిస్తున్నారు ఇమేజెస్ క్రియేటర్స్. పాత వెర్షన్ తో పోల్చితే కొత్త వెర్షన్ అద్భుతంగా ఉందంటున్నారు. గత ఇమేజెస్ తో పోల్చితే కొత్త ఇమేజెస్ లో ఎక్కువ వివరాలను పొందుపరిచే అవకాశం ఉందంటున్నారు. చూడ్డానికి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాదు, ఇమేజెస్ మరింత రియలిస్టిక్‌గా ఉన్నాయంటున్నారు టెక్ నిపుణులు.
OpenAI, ChatGPT సాయంతో చేసిన ఇమేజెస్ మాదిరిగానే DALL-E 3 లో రూపొందించిన ఇమేజెస్ అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ ఇమేజెస్ అందంతో పాటు పొందిక, ప్రాంప్ట్ ఫాలోయింగ్ మరింత మెరుగ్గా కనిపిస్తోంది. DALL-E 3తో రూపొందించిన ఇమేజెస్ ప్రాంప్ట్స్ తో పాటు మరింత లాజికల్‌గా ఉండేలా చేస్తాయి. ఇందులో తయారైన మోడల్ గందరగోళానికి గురిచేస్తుందనే భయం ఉండదు. ప్రాంప్ట్స్ కు మరింత ఖచ్చితమైన చిత్రాలను రూపొందించడమే కాకుండా, Bing ఇమేజ్ క్రియేటర్, బింగ్ చాట్‌తో రూపొందించిన చిత్రాలను గుర్తించే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ ఇమేజెస్ లో తయారు చేసిన డేట్ తో పాటు ఒక కనిపించని డిజిటల్ వాటర్ మార్క్ ను కలిగి ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. మొత్తంగా తాజాగా అందుబాటులోకి వచ్చిన DALL-E 3 సాయంతో అద్భుతమైన ఇమేజెస్ పొందే అవకాశం ఉంది.
Read Also: ‘వాట్సాప్ ఛానెల్స్’ చిరాకు పెడుతున్నాయా? ఇలా హైడ్ చేసుకోండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial