ISRO: విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌‌లో 435 అప్రెంటిస్‌ ఖాళీలు, అర్హతలివే

కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో) ఆధ్వర్యంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Continues below advertisement

కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో) ఆధ్వర్యంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 435 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు డిగ్రీ, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులకు డిప్లొమా అర్హత ఉన్నవారు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అక్టోబరు 7న వాక్‌ఇన్ నిర్వహించనున్నారు.

Continues below advertisement

వివరాలు...

* అప్రెంటిస్‌ పోస్టులు

ఖాళీల సంఖ్య: 435

1) గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు: 273

అప్రెంటిస్‌ శిక్షణ వ్యవధి: 12 నెలలు.

విభాగాలు: ఏరోనాటికల్/ ఏరోస్పేస్ ఇంజినీరింగ్, కెమికల్‌ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్/ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్, ఫైర్‌ & సేఫ్టీ ఇంజినీరింగ్, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ & కేటరింగ్‌ టెక్నాలజీ.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీటెక్‌/ బీఈ/ బీఎస్సీ/ బీకామ్‌/ బీఏ/ బ్యాచిలర్ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 30.09..2023 నాటికి జనరల్-28, ఓబీసీ-31, ఎస్సీ-33, ఎస్టీ-33 సంవత్సరాలలోపు ఉండాలి. దివ్యాంగులైతే జనరల్-38, ఓబీసీ-41, ఎస్సీ-43, ఎస్టీ-43 సంవత్సరాలలోపు ఉండాలి 

స్టైపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

2) టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ ఖాళీలు: 162

అప్రెంటిస్‌ శిక్షణ వ్యవధి: 12 నెలలు.

విభాగాలు: ఆటోమొబైల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్/ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంట్ టెక్నాలజీ.

అర్హత: టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

వయోపరిమితి: 30.09.2023 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి. ఓబీసీలకు-3, ఎస్సీ-ఎస్సీ అభ్యర్థులకు-5, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోపరిమితి వర్తిస్తుంది. 

స్టైపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: 
Government Polytechnic College, 
Kalamssery, Ernakulam Dist., Kerala.  

ఇంటర్వ్యూ తేది: 07.10.2023.

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 వరకు.

Graduate Apprentices Notification

Technician Apprentices (Diploma in Engg.) Notification

ALSO READ:

కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల వివరాలు ఇలా
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్‌-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 10లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ప్రిలిమినరీ పరీక్ష; జూన్ 22న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌లో 140 కంట్రోల్‌ ఇంజినీర్‌ ఖాళీలు, అర్హతలివే!
గురుగ్రామ్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వ్యాప్‌కోస్‌ లిమిటెడ్ సీనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్‌, ఫీల్డ్‌ క్వాలిటీ అసూరెన్స్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత విభాగాల్లో కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. పర్సనల్‌ ఇంటర్వ్యూ/ స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola