ఇంటర్నెట్ అనేక విధాలుగా మానవ జీవన విధానాన్ని సులభతరం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారు. ఇందుకోసం వెబ్ బ్రౌజర్‌లను వాడుతున్నారు. 2008లో ప్రవేశపెట్టిన గూగుల్ క్రోమ్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్‌లలో ఒకటిగా కొనసాగుగోంది. క్రోమ్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు ఎక్స్ టెన్షన్స్ ను యాడ్ చేసింది. ప్రస్తుతం ఎక్స్ టెన్షన్స్ సంఖ్య వేలల్లో ఉంది. వాటిలో అత్యంత ముఖ్యమైన కొన్ని ఎక్స్‌టెన్సన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Checker Plus
ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు, ఆన్‌లైన్‌లో కొన్ని హెవీ డ్యూటీ వర్క్స్ చేస్తున్నప్పుడు, Google క్యాలెండర్ పేజీని తెరవకుండానే రాబోయే ఈవెంట్‌లను వీక్షించడానికి ఈ ఎక్స్ టెన్షన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీటింగ్ నోటిఫికేషన్‌లు, రిమైండర్‌లను పొందడానికి, ఈవెంట్‌లను తాత్కాలికంగా ఆపివేయడానికి చెకర్ ప్లస్ యూజ్ అవుతుంది. సాధారణ క్యాలెండర్ ఎక్స్ టెన్షన్ తో పోల్చితే చెకర్ ప్లస్ 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది.
LastPass
ప్రస్తుతం ప్రతి వెబ్‌సైట్ వినియోగదారులను సైన్ అప్ చేయమని అడుగుతోంది. ఈ నేపథ్యంలో పాస్ వర్డ్‌లను గుర్తుంచుకోవడం చాలా గజిబిజిగా ఉంటుంది. LastPass అనేది పాస్‌వర్డ్ మేనేజర్, ఇది మీ మొబైల్, కంప్యూటర్ పరికరాల నుంచి మీ పాస్‌వర్డ్‌లన్నింటిని సేవ్ చేయడానికి, సురక్షిత యాక్సెస్‌ను అందించడానికి అనుమతిస్తుంది. పాస్‌వర్డ్‌లు, లాగిన్ వివరాలు మాత్రమే కాకుండా, క్రెడిట్ కార్డ్ వివరాలను కూడా సురక్షితంగా సేవ్ చేసుకోవచ్చు.
Loom
ఈ ఎక్స్‌టెన్సన్స్‌తో మీ స్క్రీన్ ను ఈజీగా రికార్డు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, సంస్థలు వారి స్క్రీన్‌లను క్యాప్చర్ చేయడానికి, కనెక్ట్ అయి ఉండటానికి ఈ అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నారు. వినియోగదారులు లూమ్‌ని ఉపయోగించి 720p, 1080p, 1440p లేదా 4K HD ఫార్మాట్‌లలో వీడియోలను రికార్డ్ చేయవచ్చు.
Grammarly
ఇ-మెయిల్‌ను కంపోజ్ చేయడం, నోట్స్ రాయడం కోసం ఈ భాషా సాధనాన్ని ఉపయోగించుకోవచ్చు. మీ రాతపూర్వక సంభాషణను మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా, మీ భాషా నైపుణ్యాలను కూడా మెరుగుపరుస్తుంది. ఈ ఎక్స్‌టెన్సన్స్‌తో చక్కగా వ్యాకరణదోషం లేకుండా నోట్స్ రాసుకునే అవకాశం ఉంటుంది. స్పెల్లింగ్ లోపాలను తనిఖీ చేయడానికి ఇది బెస్ట్ సాధనంగా మారింది.
Toggl Track
బ్యాక్-టు-బ్యాక్ డెడ్‌లైన్ పనులతో బిజీ అయినప్పుడు, టాస్క్ ల మీద టైమర్‌ను పెట్టుకోవడం ఉత్తమం. Toggl Track అనేది ఏ పనికి ఎంత సమయం కేటాయించాలో సెట్ చేసుకునే ఒక ఎక్స్‌టెన్సన్స్. ఈ టైమర్‌ను జోడించడం వల్ల ఉత్పాదకత ట్రాకింగ్‌ను అందిస్తుంది. వినియోగదారుల సమయాన్ని ట్రాక్ చేయడానికి, ఉత్పాదకతను విశ్లేషించడానికి బాగా ఉపయోగపడుతుంది.
HyperWrite
ఔత్సాహిక రచయితలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. హైపర్‌రైట్ ద్వారా వినియోగదారులను 10 రెట్లు వేగంగా బ్లాగ్ పోస్ట్‌లు, ఇమెయిల్‌లు, కాపీలను రాసేందుకు ఉపయోగపడుతుంది. AI సపోర్టుతో పని చేసే ఈ ఎక్స్‌టెన్సన్స్ నిమిషాల వ్యవధిలో చాలా నోట్స్ రాస్తుంది.
Otter.ai
AI శక్తితో, Otter.ai వినియోగదారులు వర్చువల్ సమావేశాలను ట్రాన్ స్క్రైబ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఎక్స్‌టెన్సన్స్ అత్యంత సమర్థవంతమైన లైవ్ ట్రాన్స్‌క్రిప్షన్ అప్లికేషన్‌లలో ఒకటి. ఇది Zoom, Android, Google Meet, Microsoft Teams, Cisco Webex, Android, iOS వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఆంగ్లంలో అందుబాటులో ఉంది.
Print Friendly & PDF
ఈ అప్లికేషన్ వినియోగదారులకు పేపర్, ఇంక్ ను సేవ్ చేయడానికి ఉపయోగపడుతోంది. ప్రింటర్ ఫ్రెండ్లీ పేజీని ఆప్టిమైజ్ చేస్తుంది. వినియోగదారులు ప్రింటింగ్ చేయడానికి ముందు పేజీలను సవరించవచ్చు. అనవసరమైన చిత్రాలను తీసివేయడం, టెక్ట్స్ పరిమాణాన్ని మార్చే అవకాశం ఉంటుంది.
Read Also: గూగుల్‌పై చాట్‌జీపీటీ ఎఫెక్ట్ - ఇకపై తామూ ఆ సేవలు అందిస్తామంటున్న సుందర్ పిచాయ్!