ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్ తాజా వెర్షన్ 17 అప్‌డేట్ అందరి దృష్టిలో ఉంది. ఇటీవల ఐవోఎస్ 17 బీటా ప్రజలకు విడుదల చేశారు. అప్పటి నుంచి ఐఫోన్ వినియోగదారులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా మంది ఐఫోన్ వినియోగదారులు తమ సొంత ఐఫోన్‌లో ఈ బీటా వెర్షన్‌ను ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఇందులో ఎన్నో కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు iOS 17 బీటా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నట్లయితే మీరు అందులో ఉన్న కొత్త ఫీచర్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.


ఐవోఎస్ 17 అప్‌డేట్‌లో మెసేజింగ్ యాప్ రూపురేఖలు మారినట్లు మ్యాక్‌రూమర్స్ తన కథనంలో పేర్కొంది. ఇది మునుపటి కంటే భిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది. అన్ని టూల్స్, ఫీచర్ల కోసం మీరు మూడు వేర్వేరు స్పాట్‌లపై క్లిక్ చేయనవసరం లేదు. చాట్‌లో మెసేజ్ బాక్స్‌కు ఎడమ వైపున ‘+’ నొక్కండి. మీరు కెమెరా, ఫోటోలు, స్టిక్కర్లు, క్యాష్, ఆడియో, లొకేషన్, స్టోర్ మరెన్నో యాక్సెస్ చేయవచ్చు.


మీరు ఛాటింగ్ చేసేటప్పుడు ఎమోజీని స్టిక్కర్‌లుగా ఉపయోగించవచ్చు. ఇప్పటి వరకు మీరు ఐవోఎస్ 16 ఫీచర్‌ల్లో బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఆబ్జెక్ట్‌ను తీసివేయవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఆ వస్తువును స్టిక్కర్‌గా సేవ్ చేసి మీ స్నేహితులకు పంపించవచ్చు. 


ఐవోఎస్ 17 కొత్త మెమోజీ స్టిక్కర్‌లను కలిగి ఉంటుంది. మీరు ఇప్పటికే కలెక్షన్‌లో ఉన్న హాలో, స్మిర్క్, పీకాబూ స్టిక్కర్‌లను ఉపయోగించవచ్చు. ఐవోఎస్ 17లో స్వైప్ టు రిప్లై అనే ఫీచర్ కూడా ఉంది. ఇది వాట్సాప్ నుంచి ఇన్‌స్పైర్ అయిన ఫీచర్. ఇందులో ఆడియో మెసేజ్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ కూడా ఉంది. దీనిలో ఆడియో సందేశం కంటెంట్ ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌క్రిప్ట్ అవుతుంది.


















Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial