Perplexity CEO Aravind Srinivas గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ అమ్మకానికి పెడతారా అంటూ గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు పెర్‌ఫ్లెక్సిటీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అరవింద్‌ శ్రీనివాస్ లెటర్ రాశారు. ఇప్పుడు ఇదే వార్త గ్లోబల్‌టెక్ సర్కిల్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. 34.5 బిలియన్ల డాలర్లకు అమ్మకానికి పెడతారా అంటూ ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న వాల్యూ ప్రకారం పెర్‌ఫ్లెక్సిటీ కంపెనీ విలువ 14 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉంటుంది. అలాంటి కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ అయిన గూగుల్‌కు చెందిన ఓ ప్రోడక్ట్‌ను కొనేందుకు ఆశపడటమే కాదు ఏకంగా ఓపెన్ ఆఫర్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

Continues below advertisement

గూగుల్ క్రోమ్‌కు మూడు బిలియన్లకుపైగా వినియోగదారులు ఉన్నారు. ఇప్పడు ఇది కేవలం బ్రౌజర్ మాత్రమే కాదు. గూగుల్ ఉత్పత్తిలో కీలకమైంది. గూగుల్‌సెర్చ్‌, యాడ్‌ రెవెన్యూ జనరేషన్‌, క్లౌడ్‌ సేవలకు ఇదే ఎంట్రీ గేట్ లాంటిది. అలాంటి ఉత్పత్తిని కొనుగోలు చేసేందుకు మూడేళ్ల ఎక్స్‌పీరియన్స్‌ కలిగిన కంపెనీ కొనుగోలు చేస్తామంటూ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 

పెర్‌ఫ్లెక్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసిన అరవింద్‌ శ్రీనివాస్‌ చెన్నైకు చెందిన వ్యక్తి. ఐఐటీ మద్రాస్‌లో చదువుకున్నారు. తర్వాత కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివారు. అక్కడ చదువు పూర్తి అయిన తర్వాత యోషువా బెంగియోతో కలిసి పని చేశారు. ఆయనఓ ఏఐ నిపుణుడు. గూగుల్‌లో కూడా పని చేశారు. తనకు ఉన్న అనుభవంతో 2022లో  డెనిస్‌ యారట్స్‌ జానీ హో, ఆండీ కొన్‌విన్స్‌కితో కలిసి పెర్‌ఫ్లెక్సిటీ ఏఐను ప్రారంభించారు. 

Continues below advertisement

పెర్‌ఫ్లెక్సిటీ ఏర్పాటు చేసిన కొన్ని నెలల్లోనే బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో శ్రీనివాస్ పేరు మారుమోగిపోయింది. టెక్‌ రంగంలో ఉన్న హేమాహేమీలతో పోల్చుకుంటే శ్రీనివాస్ ఇంకా ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నట్టు లెక్క అలాంటి వ్యక్తి గూగుల్‌ ఉత్పత్తిని కొనేస్తానంటూ ఓపెన్ లెటర్ రాయడం సంచలనంగా మారుతుంది. అది కూడా గూగుల్‌ క్రోమ్ కోర్టు సమస్యల్లో ఉన్నటైంలో. ఈ మధ్య క్రోమ‌కు వ్యతిరేకంగా అమెరికాలోని కోర్టు తీర్పు ఇచ్చింది. గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చేసేందుకు క్రోమ్‌ అమ్మాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే తీర్పును గూగుల్ సవాల్ చేసేందుకు సిద్ధమవుతోంది. అంతే కానీ క్రోమ్ విక్రయించేందుకు మాత్రం సిద్ఘం లేదు. కానీ ఇంతలో చెన్నైకు చెందిన 30 ఏళ్ల కుర్రాడు చేసిన ప్రతిపాదన మాత్రం టాక్‌ ఆఫ్‌ద ఇండస్ట్రీగా మారింది. 

దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయు. పెర్‌ఫ్లెక్సిటీ అనే టూల్‌ వినియోగదారులను పెంచుకునేందుకు శ్రీనివాస్ వేసిన ఎత్తుగడ అని కొందరు విమర్శిస్తున్నారు. ఇది సాధ్యమయ్యే ప్రతిపాదన కాదని వైరల్ అవ్వడానికో, న్యూస్‌లో నిలవడానికో ఇలా చేసి ఉంటారని విమర్శిస్తున్నారు. 

పెర్‌ఫ్లెక్సిటీ సీఈవో అనుకున్నట్టు గూగుల్ క్రోమ్‌ కొనుగోలు చేయాలంటే మాత్రం అంత ఈజీకాదు. నిధుల సమీకరణ పెర్‌ఫ్లెక్సిటీకి తలకు మించిన భారం అవుతుంది. ఇప్పటికే ఆ కంపెనీ ఏర్పాటుకు ఎన్‌విడియా, సాఫ్ట్‌బ్యాంక్‌ను ఒప్పించి ప్రారంభించింది. అలా చేస్తే ఒక బిలియన్ డాలర్ మాత్రమే సేకరించింది. అలాంటిది ఇప్పుడు గూగుల్ క్రోమ్‌కు ఇచ్చిన ఆఫర్ ప్రకారం 34.5 బిలియన్ డాలర్లు సమకూర్చాలంటే అంత ఈజీకాదని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు.