GPT 5: చాట్‌జీపీటీ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఇప్పుడున్న వెర్షన్‌కు అప్‌డేట్ మోడల్ తీసుకొచ్చింది. జీపీటీ -5ను ఇవాళ లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఓపెన్ ఏఐ సీఈవో సామ్ అల్ట్‌మ్యాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏఐ మార్కెట్‌లో అమెరికా టాప్లో ఉందని భారత్ రెండో స్థానంలో ఉందని, మరికొన్ని రోజుల్లోనే ఇండియా టాప్ వినియోగదారుగా మారుతుందని జోస్యం చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల ఇండియా ఎగ్రసివ్‌గా ఉందని పేర్కొన్నారు సామ్. ఎవరూ ఊహించని విధంగా చాలా వేగంగా ఈ రంగంలో అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. భారత్‌లోని వ్యక్తులు, వ్యాపార సంస్థలు చాలా ఏఐను ఉపయోగిస్తున్న విధానం చాలా ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు. చాలా సృజనాత్మకంగా వాడుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
భారత్‌లో ఏఐ పట్ల పెరుగుతున్న ఆదరణ గురించి తెలుసుకున్న ఓపెన్ ఏఐ దీన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని సామ్ తెలిపారు. అందుకే భారత్ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఇక్కడ తమ కీలకమైన భాగస్వాములతో కలిసి పని చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారతీయుల అవసరాలకు ఈ సాంకేతికత బాగా యూజ్ అవుతుందని అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో భారత్‌లో సందర్శించి ఇక్కడ పరిస్థితులను మరింతగా అధ్యయనం చేస్తాని సామ్ తెలిపారు." ప్రపంచంలోనే ఏఐ వినియోగంలో భారత్ మార్కెట్ రెండో స్థానంలో ఉంది. అమెరికా మొదటి స్థానంలో ఉంది. భారత్ మార్కెట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. భారత్ ప్రజలు ఏఐతో పని చేస్తున్నారు. మరిన్ని అద్భుతాలు చేయబోతున్నారు." అని అన్నారు.
ఇవాళ జీపీటీ-5 ప్రారంభంలో సామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది లేటెస్ట్ రీజనింగ్, కోడింగ్, ఆటోమేషన్ పనులు చేస్తుందని తెలిపారు. " ఇప్పటి వరకు ఉన్న వాటిలో జీపీటీ-5 ది బెస్ట్ మోడల్‌గా ఆల్ట్‌మ్యాన్ పేర్కొన్నారు. నిజమైన సబ్జెక్ట్ నిపుణుడిని, పీహెచ్‌డ్‌కీ స్థాయి సమాధానాలు ఇస్తుందని వివరించారు. ఉచితంగా వాడుకునే వారి నుంచి అన్ని స్థాయిల వాళ్లకు దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు.
జీపీటీ-5 మూడు విధాలుగా అందుబాటులో ఉంటుంది. ఒకటి జీపీటీ-5, రెండోది జీపీటీ-5 మిని, మూడోది జీపీటీ-5 నానో. తక్కువ ఖర్చుతో ఎక్కువ రిజల్ట్స్‌ను తక్కువ టైంలో తెలుసుకునేందుకు ఈ వెర్షన్ ఉపయోగపడుతుంది. రియాక్షన్స్ మధ్య సమన్వయం కూడా ఉంటుంది. భారత్‌లోని వివిధ భాషల్లో మెరుగైనసమాధానం ఇస్తుంది.
చాట్‌జీపీటీ విభాగానికి నాయకత్వం వహిస్తున్న నిక్‌టర్లీ మాట్లాడూ.. కొత్త మోడల్ ప్రాంతీయభాషలతోపాటు మరిన్ని భాషల్లో సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎవరుఏ భాషలలో అడిగిన సమాధానం చెప్పనుంది.
జీపీటీ-5 పని తీరు గురించి సామ్ మాట్లాడుతూ... తనకు ఎప్పటి నుంచో ఉన్న ఈమెయిల్ సమస్యను క్షణాల్లో పరిష్కరించిందని అన్నారు. తనకు ఉన్న అనుభవం ఎందుకూ పనికిరానిదిగా అనిపించిందన్నారు. ఎంతో నైపుణ్యం కలిగిన మనులు పరిష్కారం చూపించలేని సమస్యల చిక్కుముళ్లను ఏఐ విప్పిందని గుర్తు చేశారు.