AI at work: ఈ మధ్య కాలంలో వచ్చిన టెక్నాలజీ అద్భుతం ఏదైనా ఉందీ అంటే అది AI మాత్రమే. ఇంట్లో వంట నుంచి ఆఫీస్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ వరకు అన్నింటినీ క్షణాల్లో చక్కబెట్టేస్తోంది. ఈ టెక్నాలజీ కారణంగా భవిష్యత్‌లో లక్షల్లో ఉద్యోగాలు పోతాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. అందుకే లక్షల మంది ఈ AI టెక్నాలజీ నేర్చుకునే పని పడ్డారు. అయితే ఇప్పుడు నేర్చుకుంటూ తమ పనిలో వాడుతున్న వారిని తోటి వారు ఏమనుకుంటున్నారు... వారి ఆలోచన ఏంటో అమెరికా యూనివర్శిటీ స్టడీ చేసింది.
ఆఫీసులో ChatGPT, Gemini లేదా Copilot వంటి AI టూల్స్‌ని ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి, ఒక కొత్త పరిశోధన ప్రకారం, మీ సహోద్యోగులు మిమ్మల్ని చాలా దారుణంగా చూస్తున్నారట. అలా చేయడం వల్ల స్మార్ట్ వర్క్ చేస్తున్నానని మీరు అనుకోవచ్చేమో కానీ తోటి ఉద్యోగులు మాత్రం చేతకాని వాళ్లగాను, తెలివి తక్కువ దద్దమ్మలుగా చూస్తారట. అలాంటి వాళ్లు ఉద్యోగాలు చేయడానికి 'అర్హత లేనివారు'గా భావించవచ్చు. ఈ అధ్యయనం అమెరికాలోని డ్యూక్ విశ్వవిద్యాలయం నిధులతో చేశారు. అనంతరం Proceedings of the National Academy of Sciences ప్రచురించారు. AI ద్వారా పని వేగంగా చేయవచ్చు. ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతున్నప్పటికీ, ఆఫీసులో దీనికి గుర్తింపు ఉండటం లేదని తాజా అధ్యయనంలో తేలింది. ఇది ఇమేజ్‌ను దెబ్బతీస్తుంది.
పరిశోధనలో వెల్లడైన విషయాలు
పరిశోధనలో చాాల ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిశోధనలో 4,400 మంది పాల్గొన్నారు. నాలుగు వేర్వేరు ఆన్‌లైన్ ప్రయోగాలు జరిపారు. మొదటి ప్రయోగంలో, ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి వారు AI సహాయం తీసుకుంటే వారి సహచరులు వారిని ఎలా చూస్తారో మిగతాా ఉద్యోగులను అడిగారు. చాలా మంది ప్రజలు వారిని 'బద్ధకస్తులుగా', 'కష్టపడేందుకు ఇ,ష్టం లేని వారిగా' 'తక్కువ సామర్థ్యం గలవారు'గా భావిస్తారని అంగీకరించారు. కొందరు అటువంటి ఉద్యోగులను సులభంగా మార్చవచ్చని కూడా అన్నారు.
రెండో పరీక్షలో పాల్గొనేవారిని AI టూల్స్‌ని ఉపయోగించే సహోద్యోగులను వర్ణించమని అడిగారు. సమాధానాల్లో ఈ వ్యక్తులు 'డిపెండర్స్‌గా', 'తక్కువ ఆత్మవిశ్వాసం గలవారు' , ' చేతకాని వాళ్లుగా 'గా పేర్కొన్నారు.
మూడో దశలో, ప్రజలను మేనేజర్లుగా చేసి, వారు కొత్త ఉద్యోగులను నియమించాల్సిన పరిస్థితిని కల్పించారు. AI టూల్స్‌ని ఉపయోగిస్తానని చెప్పిన వారిని నియమించే అవకాశం తక్కువగా ఉంది. కానీ మేనేజర్ స్వయంగా AI వినియోగదారు అయితే, అభ్యర్థి AIని ఉపయోగిస్తున్నాడా లేదా అనే దానితో సంబంధం లేదు.
నాలుగో, చివరి ప్రయోగంలో, AI టూల్ పనికి అనుకూలంగా ఉంటే, పనితీరుపై సానుకూల ప్రభావం చూపితే, ప్రతికూల ఆలోచనలు దాదాపుగా పట్టించుకోని పరిస్థితిని చూశారు.
AIని ఉపయోగించడం అవసరమా?
ఈ అధ్యయనం ఆఫీసులో AIని ఉపయోగించడం మీ పనిని సులభతరం చేసినప్పటికీ, మిగతావారు మిమ్మల్ని ఎలా చూస్తారో దానివల్ల మీ కెరీర్‌పై ప్రభావం పడవచ్చని తెలియజేస్తుంది. సమాజం ఆలోచన మారే వరకు, AIని తెరిచి ఉపయోగించడం కొంత ప్రమాదకరం కావచ్చు. అయితే, నేటి మారుతున్న ప్రపంచాన్ని చూస్తే, AIని ఉపయోగించడం ప్రజల అవసరం అయింది.