How To Make Money on Social Media:  సోషల్ మీడియా ఇప్పుడు డబ్బులు సంపాదించేందుకు మంచి మార్గాలుగా ఉపయోగపడుతున్నాయి.  మీలో దమ్ముంటే మంచి కటెంట్‌ చేసే సత్తా ఉంటే చాలు మీరు క్రియేటర్‌గా మారొచ్చు. మీ కంటెంట్‌తో పది మందిలో మంచి పేరుతోపాటు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఈ డిజిటల్ యుగంలో Instagram, YouTubeను ఆధారంగా చేసుకొని  లక్షల రూపాయలు సంపాదిస్తున్న వారిని మనం నిత్యం చూస్తున్నాం. మీరు సరైన వ్యూహాన్ని అనుసరిస్తే, తెలివిగా  పనిచేస్తే, చాలా త్వరలో మీరు కూడా వారిలా సక్సెస్‌ఫుల్ క్రియేటర్ అవుతారు. Instagram , YouTube నుంచి వెంటనే డబ్బులు సంపాందించేందుకు కొన్ని సులభమైన, ఎఫెక్టివ్‌ మార్గాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సూచిస్తోంది.  

సరైన కంటెంట్‌ను ఎంచుకోండి

AI ప్రకారం మొదట మీకు ఆసక్తి ఉన్న, ప్రజలు చూడటానికి ఇష్టపడే అంశాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఫిట్‌నెస్, ఫుడ్ రెసిపీలు, టెక్ రివ్యూలు, గేమింగ్ లేదా మోటివేషనల్ కంటెంట్ వంటి అంశాలను మీరు ఎంచుకోవచ్చు. మీరు ఒక నిర్దిష్ట రంగంపై దృష్టి పెడితే, త్వరగా ప్రేక్షకులు మీకు దగ్గరవుతారు. అంతేకాదు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు .

సూటిగా సుత్తిలేని కంటెంట్‌ 

నేటి తరం చాలా స్పిడ్. చేసే పనిలో చూసే కంటెంట్‌లో అదే దూకుడు కలిగి ఉంటారు. ఏదైనా త్వరగా అయిపోవాలని కోరుకుంటారు. సూటిగా సత్తిలేకుండా ఉండే కంటెంట్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. Instagram Reels, YouTube Shorts పాపులర్ అవ్వడానికి ఇదే కారణం. అందుకు మంచి దమ్మున్న కంటెంట్ ఉంటే గంటల్లోనే వైరల్ అవుతున్నాయి.  15 నుంచి 60 సెకన్లలోపు వైరల్ విషయంపై  మీ అభిప్రాయాన్ని ప్రభావవంతంగా చెప్పగలిగితే మంచిదని AI సూచిస్తుంది.

అంతేకాకుండా ఎలాంటి కంటెంట్ ఇవ్వాలనే ఆలోచనలు, వీడియో ఎడిటింగ్, హెడ్‌లైన్స్‌ రాయడం,  ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు సూచించేందుకు కూడా AI టూల్స్‌ వచ్చేశాయి. ChatGPT, Canva, InVideo వంటి టూల్స్‌తో మీరు మీ పనిని మరింత సులభతరం చేసుకోవచ్చు. మీ కంటెంట్‌ను మరింత చూడముచ్చటగా మార్చవచ్చు. 

బ్రాండ్‌లతో మాట్లాడి  స్పాన్సర్‌షిప్‌లు పొందండి

ముందు మీ ఫాలోవర్లను పెంచుకోండి. తర్వాత వ్యూస్‌పై దృష్టి పెట్టండి. ఇలా రెండింటినీ పెంచుకుంటే కంపెనీలే మీ వద్దకు వస్తాయి. తమ బ్రాండ్ ప్రమోట్ చేయాలని సూచిస్తున్నాయి. బ్రాండ్ ప్రమోషన్లు, స్పాన్సర్‌షిప్ ఆఫర్లు లభిస్తాయి. AI సూచిస్తున్నట్టు 10,000 కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉంటే చిన్న బ్రాండ్‌లతో ఒప్పందాలు చేసుకోవచ్చు.  ప్రతి పోస్ట్ లేదా వీడియో నుంచి వచ్చే సంపాదన పెంచుకోవచ్చు. 

ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా వీడియోలు పోస్టు చేయండి 

రెగ్యులర్‌గా వీడియోలు పెట్టడం చాలా ముఖ్యమని చెబుతోంది AI. ప్రతిరోజూ లేదా వారంలో నిర్ణీత సమయంలో వీడియోలు, పోస్టులు పెట్టడం తప్పనిసరి అని సూచిస్తోంది. అంతే కాకుండా మీ ఫాలోవర్లతో తరచూ మాట్లాడుతూ ఉండాలని చెబుతుంది. దీని వల్ల  మీ కమ్యూనిటీ బలపడుతుందని,  ఎంగేజ్‌మెంట్ రేటు పెరుగుతుందని చెబుతుంది. సోషల్ మీడియాలో సంపాదించే వాళ్లకు ఈ రెండు చాలా అవసరమైన చర్యగా పేర్కొంటోంది. Instagram, YouTubeలో లక్షల రూపాయలు సంపాదించడం పెద్ద విషయం కాదని సరైన వ్యూహం, కష్టపడి , AI సాధనాల సహాయంతో పనిచేస్తే చాలా సులభం అని చెబుతుంది.