Google Year in Search 2025: Google ఏటా ఒక రిపోర్టును విడుదల చేస్తుంది. అందులో జనాలు ఎక్కువగా ఏం సెర్చ్ చేసారో చెప్తుంది. ఈ ఏడాది కూడా అలాంటి రిపోర్టును విడుదల చేసింది. ఇందులో నెటిజన్‌లను AI చాట్‌బాట్‌ల కోసం ఎక్కువ సెర్చ్ చేశారు. ఈ ఏడాదిలో భారత్‌లో ఎక్కువమంది జెమిని ఏఐ టూల్ కోసం ఎక్కువ సెర్చ్ చేసినట్టు గూగుల్‌ రిపోర్టు చెబుతోంది. ChatGPTని కూడా వెనక్కు నెట్టేసింది. ఈ రిపోర్ట్ చూస్తే భారత్‌లో  ఎక్కువ క్రియేట్‌ ప్రొడెక్ట్‌ విషయాలపై దృష్టి పెడుతున్నారని అర్థమవుతోంది. 

Continues below advertisement

AI టూల్స్ ప్రభావం

గూగుల్ ఇయర్లీ సెర్చ్ రిపోర్టు ప్రకారం, IPL తర్వాత ఈ సంవత్సరంలో అత్యంత ట్రెండింగ్‌లో ఉన్న రెండో సెర్చ్‌ టాపిక్ గూగుల్ జెమిని. AI కేటగిరీలో, జెమిని తర్వాత జెమిని AI ఫోటో రెండో స్థానంలో, ఎలాన్ మస్క్ కంపెనీ xAI చాట్‌బాట్ మూడో స్థానంలో, చైనీస్ చాట్‌బాట్ డీప్‌సీక్ నాల్గో స్థానంలో, పెర్ప్లెక్సిటీ ఐదో స్థానంలో నిలిచాయి. ఇతర ట్రెండింగ్ శోధనల విషయానికొస్తే, గూగుల్ AI స్టూడియో ఆరో స్థానంలో, చాట్‌జిపిటి ఏడో స్థానంలో, చాట్‌జిపిటి గిబ్లి ఆర్ట్ ఎనిమిదో స్థానంలో, ఫ్లో తొమ్మిదో స్థానంలో, గిబ్లి-శైలి ఇమేజ్ జనరేటర్ 10వ స్థానంలో నిలిచాయి. సందర్భం వారీగా, ప్రజలు హాస్యభరితమైన చాటింగ్ కోసం గ్రోక్‌ను, సెర్చ్‌ స్టైల్ రెస్పాన్స్‌ల కోసం పెర్ప్లెక్సిటీని, ఇమేజ్ జనరేషన్ కోసం డీప్‌సీక్‌ను ఉపయోగించారు.

AIపై ఆసక్తి 

ఈ సంవత్సరం భారతీయ వినియోగదారులు AI హెల్పర్లను, ఎడిటర్, ఇమేజ్ జనరేటర్ల పూర్తి ఎకో సిస్టమ్‌ను ఉపయోగించుకున్నారని నివేదిక పేర్కొంది. ఈ సంవత్సరం AI అందరికీ అండగా మారిందని నివేదిక పేర్కొంది. ప్రజలు లెర్న్‌, క్రియేట్‌, వర్క్‌ కోసం AIని విస్తృతంగా ఉపయోగించారు. ఉత్పాదకతతోపాటు కళాత్మక కార్యకలాపాల కోసం కూడా ప్రజలు AI టూల్‌ను ఉపయోగించారు. జెమిని నానో బనానా మోడల్‌ను ఉపయోగించి, ప్రజలు ఈ సంవత్సరం సోషల్ మీడియాలో వివిధ  స్టైల్‌లో తమ ఫోటోలను సృష్టించి, పంచుకున్నారు. 

Continues below advertisement

2025 సంవత్సరం గూగుల్ కు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ సంవత్సరం ప్రజలు శోధించిన విధానం గతంలో ఎన్నడూ లేని విధంగా ఉంది. AI సెర్చ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను పూర్తిగా మార్చివేసిందని, ప్రజలు గతంలో కంటే మరింత వినూత్న మార్గాల్లో ప్రశ్నలు అడుగుతున్నారని గూగుల్ చెబుతోంది. కంపెనీ ప్రకారం, ప్రతిరోజూ గూగుల్‌లో దాదాపు 15% సెర్చ్‌లు  పూర్తిగా కొత్తవి, అంటే వాటి కోసం ఇంతకు ముందు ఎప్పుడూ సెర్చ్ చేయలేదని చెబుతోంది.

ప్రపంచవ్యాప్తంగా వీడియో సెర్చ్‌ గత సంవత్సరంతో పోలిస్తే 70% పెరిగింది. ఈ మార్పుకు భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే భారతీయులు గూగుల్ లెన్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వినియోగదారులు ఇప్పుడు ఏదైనా అర్థం చేసుకోవడానికి, గుర్తించడానికి లేదా తెలుసుకోవడానికి చిత్రాలను మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

AI మోడ్, సెర్చ్ లైవ్, న్యూ అప్‌డేట్‌ సెర్చ్‌ను సులభతరం చేయడానికి, గూగుల్ 2025లో అనేక ముఖ్యమైన అప్‌డేట్‌లను విడుదల చేసింది. కంపెనీ ప్రకారం, జెమిని 3ని సెర్చ్‌కు యాడ్ చేసింది. దీనిలో సంక్లిష్టమైన ప్రశ్నలకు అధునాతన లాజిక్‌ ఉపయోగించే కొత్త AI మోడ్ ఉంది.

నానో బనానా ప్రో (జెమిని 3 ప్రో ఇమేజ్) ఫీచర్‌తో, వినియోగదారులు ఏదైనా ఆలోచనను చిత్రంగా మార్చవచ్చు, అది డిజైన్, ఇన్ఫోగ్రాఫిక్ లేదా ప్రోటోటైప్ అయినా అందిస్తుంది. వర్చువల్ అప్పారెల్ ట్రై ఆన్ ఫీచర్ భారతదేశంలో ప్రారంభించింది. ఇది వివిధ వెబ్‌సైట్‌లలో ఉన్న మిలియన్ల కొద్దీ దుస్తులను వర్చువల్‌గా ప్రయత్నించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

2025లో భారతదేశం దేని గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు?

ఈ సంవత్సరం భారతదేశంలో సెర్చ్ ట్రెండ్‌ చాలా వైవిధ్యంగా ఉంది. క్రీడల్లో IPL, మహిళా క్రికెట్ రెండూ ప్రజాదరణలో ఉన్నాయి. అంతేకాకుండా, AI ప్రపంచంలో విపరీతమైన ఆసక్తి ఉంది, గూగుల్ జెమిని ఈ సంవత్సరంలో రెండో అత్యంత వేగవంతమైన ట్రెండింగ్ శోధనగా నిలిచింది.