Elon Musk ఈ పేరే ప్రపంచంలో ఓ వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. ఆయన ఏం మాట్లాడిన ప్రపంచం టెక్ ప్రపంచం ఆగి వింటుంది. అలాంటి మస్క్‌.. మనం షేక్ అయిపోయే ప్రిడిక్షన్ చేశారు. అది పాజిటివ్‌నా నెగటివ్‌నా అనేది పక్కన పెడితే... కచ్చితంగా పట్టించుకోవలసిన విషయం. ఇంతకీ ఆయన చెప్పిందేంటంటే.. భవిష్యత్‌లో ఇక పని అనేది ఓ ఆప్షనల్‌గా మారిపోతుంది. 

Continues below advertisement


పని ఆప్షనల్ అవుతుంది.  Working will be optional


ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ కెరీర్‌కోసం... బ్రతకడం కోసం.. ఉత్పత్తి కోసం పని చేస్తున్నారు. కానీ కొన్నాళ్లకు పని అనేది ఒక హాబీలాగా మారిపోతుందని మస్క్ ప్రిడిక్ట్ చేశాడు.. ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్, పాడ్‌కాస్టర్ Nikhil Kamat పాడ్‌కాస్ట్‌ షో WTFలో మస్క్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. "మనం ఎలాగైతే.. కూరగాయలు అవసరం అయితే ఇంట్లో పెంచుకుంటాం.. లేదా బయటకెళ్లి కొనుక్కుంటామో పని విషయంలో కూడా చాయిస్ తీసుకుంటాం. I think Working become an Opional" అని కామెంట్ చేశారు. 
నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్ షోలో సాధారణ ప్రశ్నలకు అసాధణ సమాధానాలు చెప్పారు. ఇంటర్వ్యూలో అత్యంత షాకింగ్ భాగం ఇదే.
మస్క్ అంచనా ప్రకారం—దీనికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.. వచ్చే 10-15 ఏళ్లలోనే ఈ పరిస్థితి వస్తుంది. ఆయన లెక్క ప్రకారం..  AI వచ్చే పదేళ్లలో మనుషులు చేసే 60–80% పనులను తీసుకుంటుంది.  Basic services ఉచితం లేదా చాలా చౌక అవుతాయని... రోజూవారీ వ్యవహారాలన్నీAI చక్కబెట్టేస్తుందని.. అప్పుడు మనుషులు మానవులు ‘సర్వైవ్’ మోడ్ నుంచి క్రియేటివ్ మోడ్ వైపు వెళతారని ఆయన అంచనా వేస్తున్నారు. అంటే భవిష్యత్‌లో రొటీన్ పనులు చేయకుండా.. కొత్తగా క్రియేట్’ చేయడం వైపు వెళ్తారు- అన్నారు. అయితే ఇందులో ఓ ప్రమాదం కూడా ఉందని.. పాలసీ, డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేకుండా అది అసమానతలకు దారితీయొచ్చన్నారు. 




AI తో పోటీ వద్దు పనిచేయించుకోండి


AI Vs Human అనే డిబేట్ మీద మస్క్ మాట్లాడారు. AI బ్రెయిన్ గొప్పదా.. మనిషి మేధస్సు గొప్పదా అనే చర్చ అనవసరం అని మస్క్ తేల్చారు. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు.మనిషి విలువకు AI శక్తి ఎలా  జోడించాలో నేర్చుకోమని చెప్పారు. AIతో కలసి పని చేస్తే ప్రపంచం సూపర్-హ్యూమన్ స్థాయికి చేరుతుందని కానీ AIని తప్పుగా నేర్చుకుంటే…ఆ పరిణామాలు మన ఊహకు కూడా అందవని మస్క్ హెచ్చరించారు.


డబ్బు కోసం పరుగెత్తొద్దు… విలువ సృష్టించండి
ప్రపంచ కుబైరుడైన మస్క్‌..డబ్బు కోసం పరిగెత్తవద్దని చెప్పారు. మన దృష్టి ఎప్పుడూ విలువ సృష్టించడంపై ఉండాలని. డబ్బు సంపాదించడం మీద కాదన్నారు. విలువైన ప్రొడక్టులు సృష్టించినప్పుడు.. డబ్బు ఓ బై ప్రొడక్టుగా వస్తుందని చెప్పారు. ప్రపంచం మారాలంటే మనుషులు *కన్స్యూమర్లు* కాకుండా *కాన్ట్రిబ్యూటర్లు* కావాలని సూచించారు.  Create more value than you consume అని తన ట్రేడ్‌మార్క్ ఫిలాసఫీని చాటారు. స్టార్టప్‌లు కానీ, మీడియా కానీ, టెక్ కంపెనీలు కానీ.. నిజంగా ప్రజలకు ఉపయోగపడే వంటివి చేస్తే
డబ్బు, పేరు, గ్రోత్ అన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయని అన్నాడు.


భారతీయుల మేధస్తు గొప్పది


“అమెరికా ఎందుకు భారతీయులపై ఇంతగా డిపెండ్ అవుతోంది?” అని నిఖిల్ కామత్ ప్రశ్నించగా.. అమెరికన్‌ ఇన్నేవేషన్‌లో భారతీయుల పాత్ర చాలా ఉందన్నారు. "H-1B లేకపోతే US innovation పడిపోతుంది" అని కామెంట్ చేశారు. అయితే కొన్ని కంపెనీలు  H-1Bని దుర్వినియోగం చేస్తున్నాయని కూడా అన్నారు.


పిల్లల్ని కనండి.… ప్రపంచం మళ్లీ కనిపిస్తుంది


మొత్తం పాడ్‌కాస్ట్‌లో Elon మస్క్ ఓ ఇంట్రస్టింగ్ కామెంట్ కూడా చేశాడు. ప్రతి ఒక్కరూ పిల్లలను కనాలని.. వాళ్లు వారి కళ్లతో మనకు ప్రపంచాన్ని కొత్తగా ఆసక్తికరంగా చూపుతారని మస్క్ అన్నారు. పాడ్‌కాస్టర్ నిఖిల్ కామత్ తనకు పిల్లలు లేరని చెప్పినప్పుడు..పిల్లల Legacy అని కచ్చితంగా ఉండాలని చెప్పారు. Low birth-rate నాగరికతకు అతిపెద్ద ప్రమాదం. అని మస్క్ నమ్మకం
మానవత భవిష్యత్తు AI వల్ల కాదు…పిల్లలు పుట్టకపోవడం వల్లే నాశనం అవుతుందని ఆయన హెచ్చరించారు.