Google Gemini 2.5: టెక్ కంపెనీల మధ్య AI విషయంలో విపరీతమైన పోటీ నెలకొని ఉంది. ఒకదాని తర్వాత ఒకటి కంపెనీలు కొత్త AI మోడళ్లు ప్రారంభిస్తున్నాయి. ఒక కంపెనీ తీసుకొచ్చిన మోడల్‌కు మించింది మరో కంపెనీ సిద్ధం చేస్తోంది. ఇందులో పెద్ద పెద్ద కంపెనీలే పోటీ పడుతుండటంతో పోటీ ఆసక్తిగా మారింది. ఇప్పుడు అమెరికన్ టెక్ దిగ్గజం Google కొత్త అప్‌డేట్‌ ఇచ్చింది. ఇప్పటివరకు అత్యంత తెలివైన AI మోడల్ Gemini 2.5ని ప్రవేశపెట్టింది. ఇది మెరుగైన రీజనింగ్, కోడింగ్, మల్టీమోడల్ సామర్థ్యాలతో వస్తుంది. ప్రస్తుతం ఈ మోడల్ Google AI Studio, Gemini Advancedలో అందుబాటులో ఉంది. 

Continues below advertisement


Gemini 2.0 కంటే అప్‌డేటెడ్‌ వెర్షన్ Gemini 2.5
Gemini 2.5 తన పాత వెర్షన్ కంటే అధునాతనమైందని గూగుల్ చెబుతోంది. దీని రీజనింగ్ సామర్థ్యాలను పెంచారు. ఇది ఏదైనా సమాచారాన్ని విశ్లేషించి దాని సందర్భాన్ని అర్థం చేసుకొని దాని లాజికల్ రిజల్ట్ ఇచ్చేలా దీన్ని రూపొందించారు. గూగుల్ దీని కోసం దాని బేస్ మోడల్‌ను కూడా అప్‌డేట్ చేసింది. పోస్ట్-ట్రైనింగ్ టెక్నిక్‌ను ఉపయోగించిందని పేర్కొంది. 


కోడింగ్‌లో కూడా సూపర్ 
Gemini 2.5ని Gemini 2.0 కంటే మెరుగైన కోడింగ్ సామర్థ్యాలతో సిద్ధం చేసినట్టు గూగుల్‌ స్పష్టం చేసింది. ఇది వెబ్, కోడ్ అప్లికేషన్లను సృష్టించడం, కోడ్ ట్రాన్స్‌ఫార్మేషన్ టాస్క్‌లు క్షణాల్లో పూర్తి చేస్తుందని ప్రకటించింది. కోడింగ్ ఏజెంట్‌ను మూల్యాంకనం చేయడంలో ఇది 63.8 శాతం స్కోరు చేసినట్టు గూగుల్ వెల్లడించింది. గూగుల్ ఒక డెమోలో ఇది సింగిల్-లైన్ ప్రాంప్ట్ నుంచి వీడియో గేమ్ కోసం కోడ్‌ను జనరేట్ చేయడంలో విజయవంతమైందని చూపించింది.


మల్టీమోడల్ సామర్థ్యాన్ని కూడా మెరుగు 
Gemini 2.5 మల్టీమోడల్ అండర్‌స్టాండింగ్ సామర్థ్యాలను కూడా మెరుగుపరిచారు. ఇప్పుడు ఈ మోడల్ పెద్ద డేటాసెట్‌లు, ఫొటోలు, వీడియోల కోడ్‌లను మెరుగైన విధానంలో అర్థం చేసుకొని ప్రాసెస్ చేయగలదు. దీనివల్ల డెవలపర్లు, ఎంటర్‌ప్రైజెస్ కష్టతరమైన పనులను ఈజీగా పరిష్కరించగలదని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మోడల్ Google AI Studio, Gemini Advanced వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న వారాల్లో దీన్ని Vertex AI ద్వారా కూడా అందుబాటులోకి తీసుకువస్తారు. దీనికి ధరలను త్వరలోనే ప్రకటించనున్నారు.


గ్రోక్‌ నుంచి గట్టి పోటీ 


 గ్రోక్​తో ఎలాన్ మస్క్‌ మిగతా కంపెనీలకు టాస్క్‌లు ఇచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చిన గ్రోక్‌ చాలా విషయాల్లో మెరుగ్గా ఉంది. ఏ భాషలో అయినా రిప్లై ఇస్తోంది. ఇచ్చే సమాచారంలో కూడా చాలా స్పష్టత ఉంటోంది. గ్రోక్ కంటే ముందు వచ్చిన ఏఐ మోడల్స్ ఇంత క్లారిటీతో రాలేదు. అందుకే అంతా గ్రోక్‌పై పడ్డారు. ఇది మిగతా కంపెనీలను భయపెట్టింది. దీంతో వారు కూడా తాము డెవలప్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. మరింత స్పష్టతతో సమాచారం ఇచ్చేలా రూపొందిస్తున్నారు. అదే పని ఇప్పుడు గూగుల్ చేసింది.పలు విషయల్లో గూగుల్‌ను కూడా గ్రోక్  సవాల్ చేయడంతో తన ప్రోడక్ట్‌లో అప్‌డేట్ చేయాల్సి వచ్చింది. ఇది గ్రోక్ కంటే మెరుగ్గా ఉందా ఇంకా ఆ స్థాయికి చేరుకుందా లేదా అనేది తేలాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఎదురు చూడకతప్పదు.