Google Gemini: నేటి డిజిటల్ యుగంలో కృత్రిమ మేధ మనుషులతో మాట్లాడే విధానం రోజురోజుకూ మారుతోంది. అయితే ఇంట్రాక్షన్ కేవలం సమాచార సేకరణకే పరిమితం కాకుండా, అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేవిగా ఉండాలని గూగుల్ భావిస్తోంది. ఇందులో భాగంగా గూగుల్‌ జెమినీలో సరికొత్త హెల్ప్ ఈజ్ అవైలబుల్  అనే ఫీచర్‌ను రీడీజైన్ చేసి ప్రవేశపెట్టింది. 

Continues below advertisement

ఈ అప్‌డేట్‌ ప్రకారం ఒక వినియోగదారుడు జెమినితో చాట్ చేస్తున్నప్పుడు తన మానసిక వేదనను లేదా ఆత్మహత్య వంటి తీవ్రమైన ఆలోచనలను వ్యక్తం చేస్తే, ఏఐ  సంకేతాలను తక్షణమే పసిగడుతుంది. వెంటనే సంభాషణ మధ్యలో ఒక ప్రత్యేకమైన ఇంటర్‌ఫేస్ ప్రత్యక్షమవుతుంది. ఇది వినియోగదాడికి  క్రైసిస్‌ హాట్‌లైన్‌లను సంప్రదించడానికి, టెక్స్ట్‌ మెసేజ్ పంపడానికి లేదా నేరుగా నిపుణులతో మాట్లాడటానికి వన్‌ టాప్‌ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఈ సహాయక ఫీచర్ ఆ సంభాషణ ముగిసే వరకు స్క్రీన్‌పైనే కనిపిస్తూ ఉంటుంది. 

గూగుల్ ఈ చర్య తీసుకోవడానికి ప్రధాన కారణం అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టులో నమోదైన ఒక దావా. ఫ్లోరిడాకు చెందిన 36 ఏళ్ల జోనాథన్ గవాలాస్ అనే వ్యక్తి 2025లో అక్టోబ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. జెమిని చాట్‌బాట్ అతనితో వారాల తరబడి ఇంట్రాక్షన్ అయ్యింది. అతని ఆత్మహత్యను ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా చిత్రీకరించిందని, అతని మరణానికి ఏఐ సహకరించిందని అతని తండ్రి ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. 

Continues below advertisement

ఏఐ వ్యవస్థలు మనుషుల వలే ప్రవర్తించకూడదని, అవి భావోద్వేగాలను అనుకరించిడం వల్ల మానసిక బలహీనత ఉన్న వారు సులభంగా ప్రభావితం అవుతారని, ఈ కేసు ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏఐ తన పరిమితులను తెలుసుకొని ప్రవర్తించేలా గూగుల్ మార్పులు చేర్పులు చేసింది. 

ఎప్పుడు ఎలా అమలులోకి వస్తుంది?

గూగుల్ ఈ అప్‌డేట్‌ను ప్రపంచవ్యాప్తంగా దశలవారిగా విడుదల చేస్తోంది. ప్రస్తుతం అమెరికా వంటి దేశాల్లో ఇది అందుబాటులోకి రాగా, భారత్‌లో  ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావాల్సి ఉంది. జెమిని చాట్‌బాట్‌కు వినియోగదారుల మానసిక స్థితిని అర్థం చేసుకునేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 

వచ్చిన మార్పులు ఏంటీ?

జెమిని ఇకపై మనుషుల వెల భావోద్వేగ సాన్నిహిత్యాన్ని ప్రదర్శించకుండా, కేవలం ఒక సహాయకారిగా మాత్రమే వ్యవహరించేలా శిక్షణ ఇచ్చారు. ఇతరులను వేధించడం లేదా ఎగతాళి చేసేలా ప్రవర్తించకుండా ఏఐను నియంత్రించారు. ఆత్మహత్య ఆలోచనలు ఉన్నప్పుడు కేవలం సమాధానం ఇవ్వడమే కాకుండా, మానవ సహాయం పొందేలా వనరులను చూపిస్తుంది. 

కృత్రిమ మేధ విస్తరిస్తున్న వేళ టెక్ కంపెనీల భాద్యత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏఐ కేవలం కోడింగ్ లేదా సమాచారాన్ని ఇచ్చే యంత్రం మాత్రమే కాదని , అది సామాజిక బాధ్యతను కూడా కలిగి ఉండాలని  అప్‌డేట్‌ స్పష్టం చేస్తోంది. గతంలో ఏఐ చాట్‌బాట్‌లు వినియోగదారులతో అతిగా చనువు ప్రదర్శించడం వల్ల వారు భ్రమల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. 

గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్టులో పేర్కొన్నట్టుగా, సరైన సమయంలో సరైన సమాచారం, మానవ మద్ధతుతో ప్రజలను అనుసంధానించడమే మా లక్ష్యం. టెక్నాలజీ, మానవ భావోద్వేగాల మధ్య ఉన్న సన్నని గీతను గౌరవిస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఏఐ ఒక రక్షణ కవచంగా మారాలని ఈ అప్‌డేట్ ఉద్దేశం.