వర్క్ ఫ్రం హోం చేసేవారికి, ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థులకు డేటా అనేది చాలా అవసరం. అయితే ప్రస్తుతం టెలికాంలు అందించే ప్లాన్లలో గరిష్టంగా 2 జీబీ, 3 జీబీ వరకు డేటాను మాత్రమే అందిస్తున్నారు.  అయితే బీఎస్ఎన్ఎల్ అందించే రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా రోజుకు 5 జీబీ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా ఏకంగా 84 రోజులు ఉండటం విశేషం.


రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా ఈ ప్లాన్ ద్వారా అందించనున్నారు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా లభించనుంది. ఇది ఒక స్పెషల్ టారిఫ్ వోచర్. సీటాప్అప్, బీఎస్ఎన్ఎల్ వెబ్ సైట్ లేదా సెల్ఫ్ కేర్ యాక్టివేషన్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు.


దీంతోపాటు మరో వర్క్ ఫ్రం హోం ప్లాన్‌ను కూడా బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే రూ.251 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా మొత్తంగా 70 జీబీ డేటా లభించనుంది. అయితే ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ లాభాలు ఈ రూ.251 ప్లాన్‌తో రావు. వాటికి ప్రత్యేకంగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు రూ.151 ప్లాన్ ద్వారా 40 జీబీ డేటా అందించనున్నారు. బీఎస్ఎన్ఎల్ రూ.251, రూ.151 రెండు ప్లాన్ల వ్యాలిడిటీ 30 రోజులుగానే ఉంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!