కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ రోజుకు 3 జీబీ డేటా అందించే ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఎక్కువ డేటా ఉపయోగించే వారికి ఈ ప్లాన్ ఉపయోగపడనుంది. వర్క్ ఫ్రం హోం చేసేవారికి, ఆన్‌లైన్ క్లాసులు వినేవారికి, ఇంటర్నెట్‌లో సినిమాలు చూసేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడనుంది. అదే రూ.299 ప్లాన్.


బీఎస్ఎన్ఎల్ రూ.299 ప్లాన్ లాభాలు
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. రోజుకు 3 జీబీ డేటాను ఈ ప్లాన్ ద్వారా అందించనున్నారు. అంటే మొత్తంగా 90 జీబీ డేటాను అందించనున్నారన్న మాట. ఎఫ్‌యూపీ లిమిట్ అయిపోయాక నెట్ స్పీడ్ 80 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది.


డేటా లాభాలతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా ఈ ప్లాన్ ద్వారా లభించనున్నాయి. ఈ ధరలో ప్రైవేట్ టెల్కోలు అందించే ప్లాన్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు లాభాలను అందిస్తుంది. కానీ బీఎస్ఎన్ఎల్‌కు 4జీ లేకపోవడం ఒక్కటే మైనస్.


ఈ ధరలో ఎయిర్ టెల్, వొడాఫోన్ ప్లాన్లు ఇవే...
రూ.299 ధరలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్లు  కూడా ఉన్నాయి. అయితే ఇవి కేవలం రోజుకు 1.5 జీబీ డేటాను మాత్రమే అందించనున్నాయి. అంటే బీఎస్ఎన్ఎల్ అందించే డేటాలో దాదాపు సగం అన్నమాట. వీటి వ్యాలిడిటీ కూడా కేవలం 28 రోజులు మాత్రమే. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు మాత్రం ఎయిర్ టెల్, వొడాఫోన్ కూడా అందిస్తున్నాయి.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!