BSNL New Plan: ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL కొత్త ప్లాన్‌ తీసుకొచ్చింది. ప్రైవేట్ కంపెనీలు, ఇతర టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్‌టెల్, వీఐలు రీఛార్జ్ ప్లాన్ ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. ఈ టైంలో బిఎస్‌ఎన్‌ఎల్ రూ.897 బడ్జెట్‌ రీఛార్జ్ ప్లాన్ తీసుకురావడంతో హాట్ టాపిక్‌గా నిలిచింది. బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 180 రోజులు. అంటే ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఆరు నెలల పాటు మీకు రీఛార్జ్ టెన్షన్ ఉండదు.

ఆరు నెలల పాటు అపరిమిత కాల్స్ 

BSNL అందిస్తున్న సరికొత్త 897 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఎందరికో ప్రయోజనం చేకూర్చనుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ లో 180 రోజుల పాటు ఏ నెట్వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్ (అన్ లిమిటెడ్ కాల్స్) సదుపాయం ఉంది. దీని వల్ల నెలనెలా రీఛార్జ్ చేసే బాధ తప్పుతుంది. వినియోగదారులు అతి తక్కువ ధరకు సేవలు వినియోగించవచ్చు.

ఈ రీఛార్జ్ ప్లాన్ లో BSNL మొత్తం 90 GB ఇంటర్నెట్ డేటా ఇస్తుంది. ఇందులో ఎలాంటి రోజువారీ పరిమితి లేదు. వ్యాలిడిటీ టైంలో మీరు ఎలాంటి రోజువారీ పరిమితి లేకుండా డేటాను ఉపయోగించవచ్చు. మీరు ఒక వారంలో మీకు కావాల్సినంత డేటాను వాడవచ్చు. కానీ 6 నెలల పాటు మొత్తం డేటా 90 జీబీ మాత్రమే. కాల్స్, డేటాతో పాటు ఈ ప్లాన్ లో రోజుకు 100 ఉచిత SMS కూడా వస్తాయి. ఈ ప్లాన్ ముఖ్యంగా అధిక డేటాను ఉపయోగించని, కాల్స్ కోసం, వ్యాలిడిటీ కోసం చూసే వారికి మంచి రీఛార్జ్ ప్లాన్. 

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్

ఎయిర్‌టెల్ (Airtel) కూడా ఇటీవల కొత్త రీఛార్జ్ ప్లాన్ ను ప్రారంభించింది. ఈ ప్లాన్ రేటు రూ.4000. వినియోగదారులకు అంతర్జాతీయ స్థాయిలో 5GB డేటా, మొత్తం 100 నిమిషాల ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ సదుపాయం కల్పించారు. భారత్‌లో అయితే ఈ బీఎస్‌ఎన్ఎల్ ప్లాన్ లో ఒక సంవత్సరం పాటు అన్‌లిమిడెట్ కాల్స్, రోజుకు 1.5GB హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఉచిత SMS లు సెండ్ చేసుకోవచ్చు. 

Jio 365 రోజుల రీఛార్జ్ ప్లాన్

రిలయన్స్ జియో (Jio) విషయానికి వస్తే, తమ వినియోగదారులకు 3599 రూపాయల 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ అందిస్తోంది. అయితే ఈ జియో ప్లాన్ లో వినియోగదారులకు రోజుకు 2.5GB ఇంటర్నెట్ డేటా పొందుతారు. ఇందులో వినియోగదారులకు అపరిమిత కాల్స్ తో పాటు రోజుకు 100 SMS లు చేసుకోవచ్చు. ఈ ప్లాన్ లో వినియోగదారులకు అదనంగా జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. దాంతో మీరు జియో హాట్‌స్టార్ లో ఐపీఎల్ లాంటి ఈవెంట్లు, సినిమాలు చూడవచ్చు.