కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే రూ.197 ప్లాన్. ఈ కొత్త ప్లాన్ వ్యాలిడిటీ 150 రోజులు కాగా.. 2 జీబీ హైస్పీడ్ డేటాను కూడా అందించనున్నారు. అన్‌లిమిటెడ్ కాల్స్, మెసేజ్‌లను విషయంలో కంపెనీ చిన్న మెలిక పెట్టింది. ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న రీచార్జ్ ప్లాన్లలో ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు.
ఈ ప్లాన్ ప్రస్తుతం అన్ని సర్కిళ్లలో అందుబాటులో ఉంది. బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ రీచార్జ్ వెబ్ సైట్‌లో కూడా ఈ రూ.197 ప్లాన్ లిస్ట్ అయింది. ఈ ప్లాన్‌ను మొదట 91మొబైల్స్ గుర్తించింది.
బీఎస్ఎన్ఎల్ రూ.197 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 2 జీబీ హై స్పీడ్ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ 18 రోజుల పాటు లభించనున్నాయి. ఆ తర్వాత డేటా స్పీడ్ 40 కేబీపీఎస్‌కు పడిపోనుంది. ఆ తర్వాత వినియోగదారులకు ఇన్ కమింగ్ కాల్స్ వస్తాయి కానీ.. అవుట్ గోయింగ్ కాల్స్ కోసం మాత్రం కచ్చితంగా రీచార్జ్ చేసుకోవాల్సిందే. ఫ్రీ ఎస్ఎంఎస్‌లు మాత్రం 150 రోజుల పాటు లభించనున్నాయి.
ముందుగా చెప్పినట్లు ప్రస్తుతం దేశంలో ఉన్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లలో ఇది కూడా ఒకటి. ఇంత తక్కువ ధరలో ఇన్ని లాభాలను ఏ ప్లాన్ అందించలేదు. ఈ నెల ప్రారంభంలో బీఎస్ఎన్ఎల్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.44,720 కోట్ల పెట్టుబడులు లభిస్తాయని వార్తలు వచ్చాయి. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద రూ.7,443 కోట్ల సాయం కూడా బీఎస్ఎన్ఎల్‌కు లభించనుంది.