BSNL New Feature: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేటు టెలికాం కంపెనీలు అందించే రీఛార్జ్ ప్లాన్‌లు పెరిగిన తర్వాత వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ప్లాన్ల ధరలు పెరిగిన తర్వాత ప్రజలు బీఎస్ఎన్ఎల్‌కి మారుతూనే ఉన్నారు. అదే సమయంలో కంపెనీ వినియోగదారుల కోసం కొత్త ప్లాన్‌లను కూడా తీసుకువస్తూనే ఉంది. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ పాత ధరకే వినియోగదారులకు చౌక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది.
బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్‌వర్క్‌పై నిరంతరం పని చేస్తూనే ఉంది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని అనేక ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ కనెక్టివిటీని చూడవచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ స్పామ్ కాల్‌లను నివారించడానికి కొత్త సర్వీసును ప్రారంభించింది. స్పామ్ కాల్స్‌ను నివారించడానికి బీఎస్ఎన్ఎల్ ఒక గొప్ప మార్గాన్ని అవలంబించింది. ఇప్పుడు మీరు మీ బీఎస్ఎన్ఎల్ నంబర్‌కు వచ్చే స్పామ్ మెసేజ్‌ల గురించి సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. ఇది మెరుగైన సేవలను కూడా అందిస్తుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
యాప్ ద్వారా కంప్లయింట్
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు సెల్ఫ్‌కేర్ యాప్ (BSNL Self Care APP) సహాయంతో సులభంగా ఫిర్యాదులు చేయవచ్చు. ప్రస్తుతం ఇలాంటి సదుపాయం మరే కంపెనీకి లేదు అని చెప్పవచ్చు. సెల్ఫ్‌కేర్ యాప్ సహాయంతో మీరు స్పామ్ మెసేజ్‌ల గురించి ఎలా ఫిర్యాదు చేయవచ్చో తెలుసుకుందాం.
సెల్ఫ్‌కేర్ యాప్‌ని ఏ విధంగా ఉపయోగించవచ్చు...
1. ముందుగా మీ ఫోన్‌లో బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి అందులో మీ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
2. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన ఎడమ వైపు ఉన్న మూడు లైన్ల ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
3. దీని తర్వాత మీరు క్రిందికి స్క్రోల్ చేసి కంప్లయింట్ అండ్ ప్రిఫరెన్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
4. ఆపై కుడి వైపున ఉన్న మూడు లైన్ల మెనూపై క్లిక్ చేయడం ద్వారా రిపోర్ట్ చేయండి.
5. ఇప్పుడు మీరు కొత్త కంప్లయింట్‌పై క్లిక్ చేయాలి.
6. దీని తర్వాత మీరు ఎస్ఎంఎస్ లేదా వాయిస్ కాల్ నుంచి ఒక ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆపై పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
7. చివరగా వివరాలను అందించిన తర్వాత సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయాలి.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే