BSNL Long Term Plans: ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు చాలా చవకగా రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఒక వైపు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు తమ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను చాలా పెంచేశాయి. ఈ కథనంలో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న నాలుగు మంచి ప్లాన్ల గురించి తెలుసుకుందాం.


బీఎస్ఎన్ఎల్ రూ. 2399 ప్లాన్
ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ వాలిడిటీ ఏడాది కంటే ఎక్కువ. సాధారణంగా మీరు అన్ని కంపెనీల లాంగ్ టర్మ్ ప్లాన్‌ల గరిష్ట వాలిడిటీని ఒక సంవత్సరం వరకు ఉండటం చూసి ఉంటారు. కానీ బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌ ద్వారా వినియోగదారులు ఒక సంవత్సరం కంటే కొన్ని నెలల పాటు వ్యాలిడిటీని పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 395 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌తో మీరు ప్రతిరోజూ 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. 


ఈ ప్లాన్‌ ద్వారా బీఎస్‌ఎన్ఎల్ వినియోగదారులకు జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమియాన్ మొదలైన ఉచిత సౌకర్యాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు మొత్తంగా 790 జీబీ డేటాను పొందుతారు.



Also Read: యాపిల్, గూగుల్‌కు శాంసంగ్ పోటీ - ఎస్25 స్లిమ్ లాంచ్ త్వరలో!


బీఎస్ఎన్ఎల్ రూ. 1899 ప్లాన్
ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులుగా ఉంది. దీని ద్వారా రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు మొత్తంగా 600 జీబీ డేటాను పొందుతారు. దీని ద్వారా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమియాన్ మొదలైన ఉచిత సౌకర్యాలను కూడా పొందవచ్చు.


బీఎస్ఎన్ఎల్ రూ. 1499 ప్లాన్
ఈ ప్లాన్ వాలిడిటీ 336 రోజులుగా ఉంది. దీని ద్వారా రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు మొత్తం 24 జీబీ డేటాను పొందుతారు.


బీఎస్ఎన్ఎల్ రూ. 1198 ప్లాన్
ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 365 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు ప్రతి నెలా 3 జీబీ డేటా పొందుతారు. అంటే ఏడాదికి మొత్తం 36 జీబీ డేటా లభిస్తుందన్న మాట. అయితే ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్ రాదు. ఏదైనా నెట్‌వర్క్‌కి కాల్ చేయడానికి 300 నిమిషాల వాయిస్ కాలింగ్ మాత్రమే లభిస్తుంది.



Also Read: అనుకున్న దాని కంటే ముందే ఆండ్రాయిడ్ 16 - ఎప్పుడు రానుందంటే?