త్వరలో WhatsAppలో యాడ్స్, ఇకపై అప్డేట్ ట్యాబ్ లో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్
WhatsApp కొత్తగా అప్డేట్ ట్యాబ్లో ప్రకటనలు, ఛానెల్ సబ్స్క్రిప్షన్ వంటి ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. వ్యక్తిగత చాట్, కాల్స్, గ్రూపులపై ఎటువంటి ప్రభావం ఉండదు.
మీరు ప్రస్తుతం WhatsAppని కేవలం చాటింగ్ కోసం, వీడియో కాల్స్ ఉపయోగిస్తున్నారు. అయితే మెటా సంస్థ వాట్సాప్‌లో భారీ మార్పులు తీసుకొస్తుంది. వాట్సాప్ ఛానెల్‌లు, స్టేటస్‌లపై ఎక్కువ యాక్టివ్‌గా ఉండే వారికి వాట్సాప్ కొత్త ఫీచర్ కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు.
WhatsApp తన వినియోగదారుల కోసం నిత్యం మార్పులు చేర్పులు చేస్తుంటుంది. తాజాగా యాడ్స్ ను వాట్సాప్ లో చూస్తారు. ఇకనుంచి వాట్సాప్ కొన్ని సెక్షన్లలో మీకు ప్రకటనలు కనిపిస్తాయి. ఇప్పటివరకు WhatsApp అన్ని ఫీచర్లు పూర్తిగా ఉచితంగా వినియోగించారు. కానీ త్వరలో అప్‌డేట్ తరువాత ప్రకటనలతో పాటు సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ లాంఛ్ చేయాలని భావిస్తోంది మెటా.
Just In
ప్రకటనలు ఎక్కడ కనిపిస్తాయి?
WhatsApp వినియోగదారులకు చాట్, గ్రూప్ లేదా కాల్స్‌లో ఎలాంటి యాడ్ కనిపించదవు. మీరు WhatsAppలో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాత్రమే మాట్లాడితే, మీకు తాజా మార్పులతో ఏ ఇబ్బంది ఉండదు. .
కానీ మీరు ఛానెల్‌లు మరియు స్టేటస్‌లను ఉపయోగిస్తే, కొంచెం మార్పు గమనిస్తారు. అప్‌డేట్ ట్యాబ్, ఇక్కడ ఛానెల్‌లు, స్టేటస్‌లు కనిపిస్తాయి. అక్కడ వినియోగదారులకు ప్రకటనలు కనిపించేలా చేయాలని కంపెనీ యోచిస్తోంది.
పెయిడ్ ఛానెల్స్, సబ్‌స్క్రిప్షన్లు
WhatsApp ఇప్పుడు కంటెంట్ క్రియేటర్లు, బ్రాండ్‌లకు ఆర్జించడానికి అవకాశాన్ని కల్పించనుంది. రాబోయే రోజుల్లో, వినియోగదారులు కొన్ని ప్రత్యేక ఛానెల్‌లను ప్రత్యేక అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రైబ్ చేయాలి. దీని కోసం ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
మీరు ఎక్కువగా ఇష్టపడే ఛానెల్‌లతో కనెక్ట్ అవ్వడానికి కొంచెం ఖర్చు పెట్టాల్సి రావచ్చు. దాంతోపాటు ఎక్కువ మంది యూజర్లు వాటిని ఫలో కావడానికి కొన్ని ఛానెల్‌లను వాట్సాప్ ద్వారా ప్రచారం కల్పించనున్నారు.
WhatsApp తన వినియోగదారులకు ఈ మార్పులన్నీ అప్‌డేట్ ట్యాబ్‌కు మాత్రమే పరిమితం చేయనుందని స్పష్టం చేసింది. వ్యక్తిగత చాటింగ్, కాలింగ్ వంటి ఫీచర్‌లు గతంలోలాగే ప్రైవేట్‌గా, ఎలాంటి ప్రకటనలు లేకుండా ఉంటాయి.
ఈ మార్పు ఎందుకు చేస్తున్నారు
Meta 2014లో వాట్సాప్ ని కొనుగోలు చేసినప్పటి నుండి ఆ యాప్ ద్వారా ఆదాయం కోసం ఏం చేయాలని అని నిరంతరం కంపెనీ ప్రయత్నాలు చేసింది. దాంతో WhatsApp ఛానెల్స్, స్టేటస్‌లను కోట్లాది మంది చూస్తారు. కనుక ఆ ఫీచర్లలో యాడ్స్ డిస్‌ప్లే చేయడం ద్వారా ఆదాయం అవకాశాన్ని గుర్తించింది సంస్థ..
చివరికి వినియోగదారులపై ప్రభావం ఏమిటి?
మీరు కేవలం స్నేహితులతో మాట్లాడితే, ఛాటింగ్ చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. మీరు ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ చేయాల్సిన పని లేదు. వాట్సాప్ అప్‌డేట్ ద్వారా స్టేటస్‌లు, వాట్సాప్ ఛానల్స్ చూసే వారు పెయిడ్ ఫీచర్‌తో సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సి రావచ్చు.
కొంతమందికి వాట్సాప్ తాజా మార్పు నచ్చుతుంది. కంటెంట్ క్రియేటర్స్, కొన్ని సంస్థలు ఈ ఫీచర్ ద్వారా తక్కువ ధరకే యాడ్స్ పబ్లిష్ చేసుకునిప ప్రయోజనం పొందుతారు.
WhatsAppలో ఈ మార్పులు త్వరలో అమలులోకి వస్తాయి. యూజర్లు తమకు ఇష్టమైన వాట్సాప్ ఛానెల్స్ చూసేందుకు పెయిడ్ ఫీచర్ పై త్వరలోనే సంస్థ అప్‌డేట్ ఇవ్వనుంది. WhatsApp ఇకపై కేవలం చాటింగ్, కాలింగ్ కోసమే కాదు. యాడ్స్ ప్రదర్శించి సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌గా మారుతోంది.