Bajaj Chetak 3001 Electric Scooter Price, Range And Features: బజాజ్ ఆటో మరోసారి కొత్త లాంచ్ కోసం సిద్ధమవుతోంది. త్వరలో, తన ఐకానిక్ 'చేతక్‌' రేంజ్‌లో కొత్త మోడల్ "బజాజ్ చేతక్ 3001"ను విడుదల చేయబోతోంది. స్మార్ట్ టెక్నాలజీ-ప్యాక్‌డ్‌గా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్‌ కాబోతోంది, దాని స్టైల్‌ & పెర్ఫార్మెన్స్‌ మీకు నచ్చే అవకాశం ఉంది.

Continues below advertisement


స్కూటర్ పనితీరు ఎలా ఉంటుంది?
బజాజ్ చేతక్ 3001 లో 3.1kW ఎలక్ట్రిక్ మోటార్ ఫిట్‌ చేశారు, ఇది గరిష్టంగా గంటకు 62 కి.మీ. వేగాన్ని అందించగలదు. దీనికి దాదాపు 3kWh బ్యాటరీ ప్యాక్ ‍‌(Bajaj Chetak 3001 Battery Pack) ఉంది, లాంగ్‌ రేంజ్‌ ఇవ్వగలదు. కాబట్టి, ఈ స్కూటర్‌ మీ రోజువారీ అవసరాలైన కాలేజ్‌కు వెళ్లడం, ఆఫీసుకు వెళ్లడం, మార్కెట్‌కు వెళ్లడం లేదా కాస్త దూరపు ప్రయాణాలు వంటి వాటిని సింగిల్‌ ఛార్జ్‌లో సులభంగా తీర్చే అవకాశం ఉంది. వేగం & రేంజ్‌ ఇవ్వడంతో పాటు కాస్త తక్కువ ధరలో, తక్కువ నిర్వహణతో & రోజువారీ ప్రయాణానికి నమ్మకంగా పనికివచ్చే స్కూటర్‌ కోసం చూస్తున్నవాళ్లకు ఈ టూవీలర్‌ బాగా సరిపోతుంది.


డిజైన్‌లో మెటల్ బాడీ ఫినిషింగ్ 
బజాజ్ చేతక్ 3001 డిజైన్, కంపెనీ ప్రస్తుత చేతక్ మోడళ్ల లాగానే క్లాసిక్‌ లుక్‌తో స్ట్రాంగ్‌గా ఉంది. ఈ బండికి మెటల్ బాడీ ఫినిషింగ్ ఇచ్చారు, ఇది ప్రీమియం లుక్ & ఫీల్ ఇస్తుంది. పరిమాణం గురించి మాట్లాడుకుంటే... బజాజ్ చేతక్ 3001 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ పొడవు 1914 మి.మీ., వెడల్పు 725 మి.మీ. & ఎత్తు 1143 మి.మీ. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 168 మి.మీ. & వీల్ బేస్ 1355 మి.మీ. స్కూటర్‌ మొత్తం బరువు 123 కిలోలు. ముందు & వెనుక రెండింటిలోనూ 90/90-12 సైజు టైర్లను బిగించారు. ఈ స్పెసిఫికేషన్లు ఈ బండిని సిటీ ట్రాఫిక్‌లో లేదా హైవేలపై నడపడానికి సరైన ఆప్షన్‌గా నిలబెట్టాయి.


స్కూటర్ ధర ఎంత?
బజాజ్ చేతక్ 3001 ధర మీ బడ్జెట్‌లోనే ఉండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఎక్స్-షోరూమ్ ధర (Bajaj Chetak 3001 Electric Scooter ex-showroom price) సుమారు లక్ష రూపాయలు ఉంటుందని అంచనా. మీరు చేతక్ 2903 కి ప్రత్యామ్నాయం కోసం చూస్తుంటే లేదా కొంచెం ఎక్కువ ఫీచర్లు ఉన్న స్కూటర్ కావాలనుకుంటే, చేతక్ 3001 మీకు మంచి ఎంపిక కావచ్చు. కంపెనీ ఈ వారంలోనే బజాజ్ చేతక్ 3001 ను లాంచ్‌ (Bajaj Chetak 3001 Electric Scooter Launch Date) చేయబోతోంది. లాంచింగ్‌ తర్వాత ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రేంజ్‌, ఛార్జింగ్ సమయం, స్మార్ట్ ఫీచర్లు & కనెక్టివిటీ గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది.


విశ్వసనీయ బజాజ్ బ్రాండ్ నుంచి వస్తున్న చేతక్ 3001 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లో ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే, దీనికి క్లాసిక్ డిజైన్ ఇచ్చినప్పటికీ మోడర్న్‌ ఫీచర్లతో తీర్చిదిద్దారు. పనితీరు అద్భుతంగా ఉండొచ్చు & ధర కూడా కామన్‌ మ్యాన్‌ బడ్జెట్‌లోనే ఉంటుంది. కాబట్టి, నగరాలు లేదా పట్టణాల్లో రోజూ అప్‌-డౌన్‌ చేసేవాళ్లకు ఈ బండి డ్యూరబుల్‌ & స్టైలిష్ ఆప్షన్‌గా మారవచ్చు.