2025 జూన్ 17 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu June 17th 2025

మేష రాశి (Aries) 17 జూన్ 2025

పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. పనిఒత్తిడి అధికంగా ఉంటుంది. పనిచేసే ప్రదేశంలో ఆర్థికంగా లాభపడతారు. అనవసరమైన ఆందోళనలకు గురవడం వల్ల మీ దృష్టి మరలిపోతుంది. ఏదైనా పనిపై ఇంటి నుంచి దూరంగా వెళ్లాల్సి రావొచ్చు. కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దూరంగా ఉండండి.

వృషభ రాశి (Taurus) 17 జూన్ 2025

మీరు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే ఒక అపరిచితుడిని కలుస్తారు. ప్రేమ జీవితంలో ఉన్నవారు కొత్త జీవితం ప్రారంభిస్తారు. మీరు చేసే పనిపై  ఆసక్తి కలిగి ఉంటారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సీనియర్లు ఈ రోజు మీ పనిలో మీకు పూర్తి సహకారం అందిస్తారు. మీరు ఎవర్నీ బాధించవద్దు. సాయంత్రం కుటుంబ సభ్యులతో సమయం స్పెండ్ చేస్తారు. మిథున రాశి (Gemini) 17 జూన్ 2025

ఆస్తి సంబంధించిన వివాదం ఏదైనా నడుస్తుంటే అందులో సక్సెస్ అవుతారు. కుటుంబ సభ్యుల నుంచి మీకు సహకారం అందుతుంది. ఉద్యోగులు మంచి ఆఫర్ పొందుతారు. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పని పూర్తవుతుంది. జీవితభాగస్వామితో చాలాకాలంగా కొనసాగుతున్న మనస్పర్థలు ఈరోజు ముగిసిపోతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.  

కర్కాటక రాశి (Cancer) 17 జూన్ 2025

జీవిత భాగస్వామి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడం వల్ల ఆందోళన ఉంటుంది. ఏదైనా సమావేశంలో పాల్గొనాల్సి వస్తే ఆలోచించి మాట్లాడడం బెటర్. వ్యాపారులకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది. నూతన వనరుల నుంచి ఆదాయం పొందుతారు. ప్రణాళికలు అమలుచేసేందుకు ఇదే మంచి సమయం. సాయంత్రం సమయంలో స్నేహితుల నుంచి బహుమతులు తీసుకుంటారు.

సింహ రాశి (Leo) 17 జూన్ 2025

ఉద్యోగులకు కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది. పదోన్నతి గురించి సమాచారం అందుతుంది.  వ్యాపారం చేస్తున్నవారు ఈ రోజు పెద్ద డీల్ ఖరాలు చేసుకుంటారు. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. విద్యలో మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజు సోదరులు, సోదరీమణుల నుంచి సహాయం పొందుతారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. 

కన్యా రాశి (Virgo) 17 జూన్ 2025

ఈ రోజు అనవసరమైన ఖర్చులు మీకు సమస్య కలిగిస్తాయి. పనిచేసే ప్రదేశంలో శత్రువులు యాక్టివ్ గా ఉంటారు మీరు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు చేసే వాగ్ధానాన్ని నెరవేర్చాలి. ఏదైనా పథకంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. కుటుంబంలో ముఖ్యమైన సమస్యల గురించి చర్చిస్తారు.  

తులా రాశి (Libra) 17 జూన్ 2025

మీరు పనిచేసే ప్రదేశంలో మంచి పురోగతి సాధిస్తారు. ఆర్థికంగా బలపడేందుకు అవకాశం లభిస్తుంది. సృజనాత్మక పనుల్లో మంచి ఫలితం సాధిస్తారు. మీ ఆలోచనలతో పెద్దలను మెప్పిస్తారు. పిల్లలకు శుభవార్త వింటారు. మీరు కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే ఈరోజు ఉపశమనం పొందుతారు. 

వృశ్చిక రాశి (Scorpio) 17 జూన్ 2025

మీరు మీ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. మీ పనిలో నిర్లక్ష్యంగా ఉంటే ఆ తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.  ఏదైనా కొత్త పని చేసేందుకు ఆలోచిస్తే ఈ రోజు అడుగు ముందుకు పడుతుంది. జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో వాగ్వాదం జరగొచ్చు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది

ధనుస్సు రాశి (Sagittarius) 17 జూన్ 2025

అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం బాగుండటం వల్ల మీరు ఈ రోజు ఒత్తిడి లేకుండా ఉంటారు. ఇంట్లో పెద్దలతో ఏదైనా శుభ కార్యక్రమం గురించి చర్చించవచ్చు. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. సోదరులు, సోదరీమణులతో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి . కుటుంబం అంతా సంతో  ఒకరితో ఒకరు నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీరు పని రంగంలో ఇంతకు ముందు ఏదైనా తప్పు చేస్తే, మీరు దానిని సరిదిద్దుకోవాలి.  

మకర రాశి (Capricorn) 17 జూన్ 2025

ఈ రోజు ఏదైనా సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యాలయంలో సహోద్యోగులతో కలిసి సమయం గడపడం కన్నా మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. ఈ రోజు బయటివ్యక్తి కారణంగా మీ కుటుంబంలో గొడవ జరగొచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు మీకుంటుంది. అబద్ధం చెప్పొద్దు. సాయంత్రం దైవదర్శనం ద్వారా ప్రయోజనం పొందుతారు.

కుంభ రాశి (Aquarius) 17 జూన్ 2025

ఈ రోజు మీరు స్నేహితుడి నుంచి మంచి విషయం వింటారు. ఆస్తిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే అడుగు ముందుకు పడుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న డబ్బు ఈ రోజు లభిస్తుంది. నూతన పెట్టుబడులు మంచి ఫలితాన్నిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ కొనసాగుతుంది. 

మీన రాశి (Pisces) 17 జూన్ 2025

ఈ రాశి వ్యాపారులు మానసిక ఒత్తిడి ఎదుర్కొంటారు. వాహనం జాగ్రత్తగా నడపండి. ఉద్యోగులు ఈ రోజు కార్యాలయంలో తమ పనిపై దృష్టి సారించాలి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ జీవితంలో ఉన్నవారు భాగస్వామి ప్రవర్తన గురించి ఆందోళన చెందుతారు. పిల్లల వైపు నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.