BGMI on Google Play: గేమర్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. భారతదేశంలో ఎంతో క్రేజ్ ఉన్న Battlegrounds Mobile India (BGMI) ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ని ఉపయోగిస్తుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ గేమ్‌ను గతంలో బ్యాన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ నిషేధాన్ని ఎత్తేశారు. ప్రస్తుతం ఏ ఆండ్రాయిడ్ యూజర్ అయినా దీన్ని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ గేమ్‌ను గతంలో బ్యాన్ చేశారు. ఇప్పుడు ఈ నిషేధాన్ని ఎత్తేసినట్లు అనిపిస్తుంది.


బీజీఎంఐ డౌన్‌లోడ్ ఈ విధంగా చేయవచ్చు
బీజీఎంఐ తిరిగి ప్లే స్టోర్‌లోకి తిరిగి వచ్చిన మాట నిజం. కానీ మీరు దీన్ని నేరుగా ప్లే స్టోర్‌లో సెర్చ్ చేసినప్పుడు, మీకు గేమ్ లభించకపోవచ్చు. మీరు గేమ్‌ను డౌన్‌లోడ్ చేయాలనుకుంటే, దీని కోసం BGMI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. వెబ్‌సైట్‌కి వెళ్లాక అక్కడ మీరు ప్లేస్టోర్ బటన్‌పై క్లిక్ చేయాలి. ప్లేస్టోర్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న బీజీఎంఐ డౌన్‌లోడ్ పేజీకి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ నుంచి మీరు గేమ్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


యాప్ స్టోర్‌కి సంబంధించిన అప్‌డేట్ ఏమిటి?
ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్‌లో బీజీఎంఐ అందుబాటులో లేదు. అంటే ఐఫోన్ యూజర్లు మరి కొంత కాలం ఆగాలన్న మాట. ఐవోఎస్ యూజర్లకు కూడా ఈ గేమ్ అందుబాటులోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని తెలుస్తోంది.


సర్వర్ ప్రాబ్లం
మీరు గేమ్‌ని డౌన్‌లోడ్ చేయవచ్చు కానీ సర్వర్ సమస్యల కారణంగా ప్రస్తుతం ఈ గేమ్ ఆడటం సాధ్యం కాదు. అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని కంపెనీ తెలిపింది.


అయితే ఈ గేమ్ కారణంగా గతంలో కొన్ని దారుణాలు కూడా జరిగాయి. పబ్‌జీ గేమ్ ఆడొద్దని తల్లి మందలించినందుకు లఖ్‌నవూలోని ఓ బాలుడు కన్నతల్లినే కాల్చి చంపాడు. ఆర్మీలో పని చేసే తన తండ్రి లైసెన్స్‌డ్ తుపాకీతో తల్లిని హత్య చేయటం సంచలనమైంది. పబ్‌జీ పనైపోయిందనుకుంటున్న తరుణంలో మరోసారి ఈ ఘటన జరగటం అందరినీ ఆందోళనకు గురి చేసింది. హత్య చేసిన తరవాత దాదాపు మూడు రోజుల పాటు శవంతో ఇంట్లోనే ఉండిపోయాడు ఆ బాలుడు. పొరుగింటి వాళ్లకు అనుమానం రాకుండా రూమ్ ఫ్రెష్‌నర్స్‌ వినియోగించాడు.


పబ్‌జీ కారణంగా ఇలాంటి నేరాలు జరగటం ఇదే తొలిసారేమీ కాదు. 2022 జనవరిలో పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఓ 14 ఏళ్ల బాలుడు పబ్‌జీ మత్తులో పడిపోయాడు. ఆడొద్దని వారించినందుకు కుటుంబ సభ్యుల్ని తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తల్లితో సహా ఇద్దరు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది ఈ ఘటన. భారత్‌లోనూ ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండటం వల్ల కేంద్రం బ్యాన్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమంలో నిర్వహించిన సందర్భంలో ఓ తల్లి తన కుమారుడు పబ్‌జీకి బానిసైపోయాడంటూ వాపోయింది. పబ్‌జీ వాలా హై క్యా అంటూ ప్రధాని నరేంద్రమోదీ అప్పట్లో వ్యాఖ్యలు చేశారు కూడా. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ సమస్య తీవ్రమవుతూనే వచ్చింది.