Mini Washing Machine Under 2K: ప్రస్తుతం చలి కాలం కావడంతో భారతదేశంలో తీవ్రమైన చలి ఉంది. ఈ చలికాలంలో చల్లటి నీళ్లలో బట్టలు ఉతకాల్సి వస్తే సమస్య వస్తుంది. చలికాలంలో సాక్స్‌లు, మఫ్లర్‌లు, క్యాప్‌లు ఇలా ఎన్నో చిన్న చిన్న బట్టలు ఎక్కువగా వాడతారు. అందువల్ల వాటిని క్రమం తప్పకుండా ఉతకాలి. శీతాకాలంలో వాటిని చేతితో ఉతకడం వల్ల కలిగే ఇబ్బందులను అధిగమించడానికి అనేక చిన్న వాషింగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.2000 లోపు వచ్చే ఈ వాషింగ్ మెషీన్లు పనిని చాలా సులభతరం చేయడంతోపాటు పోర్టబుల్‌గా కూడా ఉంటాయి. అలాంటి కొన్ని ఆప్షన్లను పరిశీలిద్దాం.


రేయాన్ష్ పోర్టబుల్ వాషింగ్ మెషిన్ (REYANSH Portable Washing Machine)
ఈ పోర్టబుల్ వాషింగ్ మెషీన్ సామర్థ్యం రెండు కిలోలు. ఇది ఫోల్డబుల్ డిజైన్‌తో వస్తుంది. ఉపయోగంలో లేనప్పుడు మంచం లేదా టేబుల్ కింద దీన్ని సులభంగా నిల్వ చేయవచ్చు. తక్కువ కరెంటుతోనే బట్టల్లో అంటుకున్న మురికిని, దుమ్మును సులభంగా తొలగించవచ్చు. ఇది పిల్లల బట్టలు, తువ్వాల్లు, టీ షర్టులు మొదలైనవాటిని శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులో మూడు టైమ్ మోడ్‌లు ఉన్నాయి. తేలికైనందున, ప్రయాణిస్తున్నప్పుడు కూడా వెంట తీసుకెళ్లవచ్చు. ఇది అమెజాన్‌లో రూ. 1,499కి అందుబాటులో ఉంది.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?


వెల్విజి సెమీ ఆటోమేటిక్ ఫోల్డింగ్ మినీ వాషింగ్ మెషిన్ (WELVIZHI Semi Automatic Folding Mini Washing Machine)
ఫోల్డబుల్ డిజైన్‌తో వచ్చిన ఈ వాషింగ్ మెషీన్ బరువు కూడా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా మెయింటెయిన్స్ కూడా సులభంగా ఉంటుంది. ఈ వాషింగ్ మెషీన్‌ను ఆపరేట్ చేయడం చాలా సులభం. ఒక కంట్రోల్ బటన్ మాత్రమే ఉంటుంది. అందులో చిన్న చిన్న బట్టలు ఉతకడంతో పాటు బొమ్మలను కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఇది పర్యావరణ అనుకూల పదార్థంతో తయారు అయింది. ఉపయోగించిన తర్వాత దీన్ని మడతపెట్టి సులభంగా డ్రాయర్‌లో ఉంచవచ్చు. ఇది అమెజాన్‌లో రూ. 1,699కి విక్రయానికి అందుబాటులో ఉంది. 


వెర్నాక్సీ వాషింగ్ మెషిన్ పోర్టబుల్ (Vernaxy Washing Machine Portable)
వన్ పీస్ రబ్బర్ మౌల్డింగ్‌తో కూడిన ఈ మెషిన్ ఫోల్డబుల్ డిజైన్‌లో కూడా వస్తుంది. దీన్ని తీసుకువెళ్లడం, నిల్వ చేయడం సులభం. దీని సామర్థ్యం రెండు కిలోలు. ఇది బట్టలపై ఉన్న మరకలను సులభంగా తొలగిస్తుంది. మొత్తం మెషీన్‌ను ఒకే బటన్‌తో కంట్రోల్ చేయవచ్చు. ఇది చిన్న బట్టలు ఉతకడానికి ఉపయోగపడుతుంది. ఇది అమెజాన్‌లో రూ. 1,399కి అందుబాటులో ఉంది.



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!