Best Laptops Under Rs 30000: రూ.30 వేలలోపు మంచి ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - ఈ టాప్-5 లిస్ట్ చూసుకోండి!

Top 5 Laptops Under Rs 30000: ప్రస్తుతం రూ.30 వేలలోపు మనదేశంలో అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే. వీటిలో హెచ్‌పీ క్రోమ్‌బుక్ 15.6 నుంచి లెనోవో ఐడియాప్యాడ్ 1 వరకు ఉన్నాయి.

Continues below advertisement

Best Laptops Under Rs 30k: కోవిడ్ తర్వాత మన రోజువారీ అవసరాల జాబితాలో ల్యాప్‌టాప్ కూడా చేరిపోయింది. చదువుకోవడానికి అయినా, వర్క్ చేసుకోవడానికి అయినా సరే ల్యాప్‌టాప్ మస్ట్ అయింది. దీంతో మనదేశంలో ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఎక్కువమంది రూ.30 వేలలోపు ధరలో మంచి ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారు. ఇందులో కొన్ని బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే.

Continues below advertisement

హెచ్‌పీ క్రోమ్‌బుక్ 15.6 (HP Chromebook 15.6)
ఒకవేళ మీరు సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉన్న ల్యాప్‌టాప్ కావాలనుకుంటే హెచ్‌పీ క్రోమ్‌బుక్ 15.6 మంచి ఆప్షన్. దీని బ్లూ కలర్ మోడల్ చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇంటెల్ సెలెరాన్ ఎన్4500 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పని చేయనుంది. సింపుల్ వెబ్ బ్రౌజింగ్, కంటెంట్ చూడటం, హెవీ టాస్కులు కూడా నోట్స్ తీసుకోవడం వంటి టాస్కులను ఇది సులభంగా హ్యాండిల్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి కూడా దీన్ని సులభంగా మేనేజ్ చేయవచ్చు. దీని ధర రూ.28,999గా ఉంది.

అసుస్ వివోబుక్ గో15 (Asus Vivobook Go 15)
ఇందులో 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ అందించారు. సెలెరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ రన్ కానుంది. ఇది సెలెరాన్ ఎన్4500 ప్రాసెసర్ కంటే మెరుగైన పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. దీని కీబోర్డు క్వాలిటీ కూడా చాలా బాగుంది. 15.6 అంగుళాల పెద్ద డిస్‌ప్లేనే ఇందులో అందించారు. దీని ధర రూ.27,990గా నిర్ణయించారు.

ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ వై1 ప్లస్ (Infinix Inbook Y1 Plus)
ఈ లిస్టులో అత్యంత స్టైలిష్ ల్యాప్‌టాప్ ఇదే. ఇందులో ఇంటెల్ కోర్ i3 10వ తరం ప్రాసెసర్‌ను అందించారు. ఇది టాస్కులను మరింత ప్రభావవంతంగా నిర్వహిస్తుంది. దీంతో ల్యాప్‌టాప్ త్వరగా స్లో అవ్వదు. దీని అంచులు చాలా సన్నగా ఉన్నాయి. 15.6 అంగుళాల డిస్‌ప్లే ఇందులో ఉంది. అంచులు కూడా చాలా సన్నగా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని రూ.28,990కే కొనుగోలు చేయవచ్చు.

హెచ్‌పీ 255 జీ8 (HP 255 G8)
క్రోమ్‌బుక్ కాకుండా వేరే హెచ్‌పీ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటే ఇది మంచి ఆప్షన్. టెక్స్చర్డ్ బాడీతో ఈ ల్యాప్‌టాప్ మార్కెట్లోకి వచ్చింది. ఉద్యోగులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఏఎండీ రైజెన్ 3 సిరీస్ సీపీయూను అందించారు. దీన్ని రూ.29,990 నుంచి కొనుగోలు చేయవచ్చు.

లెనోవో ఐడియాప్యాడ్ 1 (Lenovo Ideapad 1)
చిన్న డిస్‌ప్లే ఉన్న ల్యాప్‌టాప్ కావాలనుకుంటే ఇది బెటర్ ఆప్షన్. ఇందులో 11.6 అంగుళాల డిస్‌ప్లే అందించారు. సిల్వర్ ఫినిష్‌తో ఈ ల్యాప్‌టాప్ లాంచ్ అయింది. ఇది ఒక పోర్టబుల్ ల్యాప్‌టాప్. రోజువారీ వర్క్ పరంగా చూసుకుంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ ద్వారా మీరు పని చేసుకోవచ్చు. 4 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్‌డీ, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.25,289గా ఉంది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

Continues below advertisement
Sponsored Links by Taboola