Cheapest 5G Smartphones: ప్రస్తుతం మనదేశంలో 5జీ స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో చాలా కంపెనీలు తక్కువ ధరలో 5జీ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు అనేక సరికొత్త ఫీచర్లతో మార్కెట్లో ఉన్నాయి. ప్రస్తుతం మనదేశంలో రూ.10 వేలలోపు ధరలో ఉన్న బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం. ఇందులో టెక్నో పాప్ 9 5జీ, ఐటెల్ కలర్ ప్రో 5జీ, రెడ్‌మీ 13సీ 5జీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
టెక్నో పాప్ 9 5జీ (TECNO POP 9 5G)
టెక్నో పాప్ 9 5జీ స్మార్ట్‌ఫోన్ 48 మెగాపిక్సెల్ సోనీ ఏఐ కెమెరాతో వస్తుంది. 5జీ కనెక్టివిటీ, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్‌తో ఈ ఫోన్ ఈ ధరల రేంజ్‌లో మెరుగైన ఆప్షన్‌గా ఉంది. ఇది డీ6300 5జీ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్ నాలుగేళ్ల పాటు ల్యాగ్ లేకుండా సాఫీగా నడుస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది లాంగ్ బ్యాటరీ బ్యాకప్‌ని ఇస్తుంది. ఫోన్‌లో డ్యూయల్ స్పీకర్లు కూడా అందించారు. ఇవి అద్భుతమైన ఆడియోను అందిస్తాయి. అమెజాన్‌లో ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.9,499గా ఉంది.
Also Read: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?
ఐటెల్ కలర్ ప్రో 5జీ (iTel Color Pro 5G)
ఐటెల్ కలర్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. దీని వెనుక ప్యానెల్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇది 6 జీబీ RAM, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీన్ని మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా 12 జీబీ వరకు విస్తరించవచ్చు. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. అలాగే ఇది పెద్ద 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ధర గురించి చెప్పాలంటే అమెజాన్‌లో ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.9,490గా ఉంది.
రెడ్‌మీ 13సీ 5జీ (Redmi 13C 5G)
రెడ్‌మీ 13సీ 5జీ స్టార్ లైట్ బ్లాక్ కలర్‌లో వచ్చే శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్. ఇది 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది. ప్రాసెసర్ గురించి చెప్పాలంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 5జీ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇది ఫోన్‌ను మరింత వేగవంతంగా చేస్తుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.8,999గా ఉంది.
Also Read: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?