Android 13 Devices: ఆండ్రాయిడ్ 13 మొదట వచ్చే డివైసెస్ ఇవే - మీ ఫోన్ ఉందేమో చూసుకోండి!

ఆండ్రాయిడ్ 13 లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం బీటా వెర్షన్ 2ని గూగుల్ విడుదల చేసింది. ఇది సపోర్ట్ చేసే ఫోన్లు ఇవే.

Continues below advertisement

ఆండ్రాయిడ్ 13 బీటా వెర్షన్ 2ని పిక్సెల్ స్మార్ట్ ఫోన్లకు మే 11వ తేదీన అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేవలం గూగుల్ ఫోన్లకే కాకుండా మరిన్ని ఇతర ఫోన్లకు కూడా ఈ అప్‌డేట్‌ను కంపెనీ అందించనుంది. ఈ జాబితాను గూగుల్ విడుదల చేసింది. అయితే ఈ బీటా వెర్షన్‌ను ప్రస్తుతానికి సాధారణ వినియోగదారులకు కాకుండా డెవలపర్లకు మాత్రమే అందించనున్నారు.

Continues below advertisement

ఆండ్రాయిడ్ 14 బీటా ప్రోగ్రాంలో చాలా స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో కొన్ని కంపెనీలకు సంబంధించిన ఒక్క మొబైల్‌కు మాత్రమే ఈ అప్‌డేట్‌ను అందించనున్నారు. కొన్ని కంపెనీలకు సంబంధించి ఎక్కువ స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి. ఏయే కంపెనీలకు చెందిన ఫోన్లు ఎన్నేసి ఉన్నాయో ఈ జాబితాలో చూడండి.

గూగుల్
పిక్సెల్ 4, పిక్సెల్ 4 ఎక్స్ఎల్, పిక్సెల్ 4ఏ, పిక్సెల్ 4ఏ 5జీ, పిక్సెల్ 5, పిక్సెల్ 5ఏ, పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో

షియోమీ
షియోమీ 12, షియోమీ 12 ప్రో, షియోమీ ప్యాడ్ 5

ఒప్పో
ఒప్పో ఫైండ్ ఎన్, ఒప్పో ఫైండ్ ఎక్స్5 ప్రో

అసుస్
అసుస్ జెడ్‌ఫోన్ 8

లెనోవో
లెనోవో ట్యాబ్ పీ12 ప్రో

నోకియా
నోకియా ఎక్స్20

వన్‌ప్లస్
వన్‌ప్లస్ 10 ప్రో

రియల్‌మీ
రియల్‌మీ జీటీ 2 ప్రో

షార్ప్
షార్ప్ అక్వోస్ సెన్స్ 6

టెక్నో
టెక్నో కామోన్ 19 ప్రో 5జీ

వివో
వివో ఎక్స్80 ప్రో

జెడ్‌టీఈ
జెడ్‌టీఈ యాక్సాన్ 40 అల్ట్రా

ఆండ్రాయిడ్ 13లో గూగుల్ ఎన్నో ఫీచర్లను అందించనుంది. మెరుగైన సెక్యూరిటీ, ప్రైవసీ సెట్టింగ్స్, ఆల్బం ఆర్ట్ వర్క్ ఉన్న కొత్త మీడియా కంట్రోల్, ఫొటోస్, వీడియోస్‌లో కొన్నిటికి మాత్రమే యాక్సెస్ ఉండటం వంటి బెటర్ ఫీచర్లు అందించారు. దీంతోపాటు ఆండ్రాయిడ్ 13లో మల్టీ లింగ్వల్ ఫీచర్లు కూడా అందించారు. అంటే ఒక్కో యాప్‌ను ఒక్కో భాషలో యాక్సెస్ చేసే అవకాశం ఉంది.

దీంతోపాటు గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్ ఫోన్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ కానుంది. ఇందులో గూగుల్ టెన్సార్ ప్రాసెసర్, వెనకవైపు రెండు కెమెరాలు, 6 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Continues below advertisement