Android Security Update: 2025 జనవరిలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్ సెక్యూరిటీ అప్‌డేట్లను విడుదల చేసింది. ఇంతకు ముందు వచ్చిన అప్‌డేట్లతో మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఉపయోగిస్తుంటే వీలైనంత త్వరగా ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని గూగుల్ వినియోగదారులను హెచ్చరించింది. ఈ అప్‌డేట్‌లో అనేక లోపాలు పరిష్కరించార. ఇది మీ ఫోన్‌ను హ్యాకర్ల నుంచి సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ సెక్యూరిటీ అప్‌డేట్‌ను రెండు భాగాలుగా విభజించారు. అవే 2025-01-01, 2025-01-05 సెక్యూరిటీ ప్యాచ్ లెవల్స్.


2025-01-01 సెక్యూరిటీ ప్యాచ్... ఆండ్రాయిడ్ సిస్టం, ఫ్రేమ్‌వర్క్‌లోని లోపాలను పరిష్కరిస్తుంది. 2025-01-05 సెక్యూరిటీ ప్యాచ్ హార్డ్‌వేర్ సంబంధిత లోపాలను పరిష్కరిస్తుంది. ఈ లోపాలలో కొన్ని ఆండ్రాయిడ్ 12, 13, 14, 15కు సంబంధించిన అన్ని వెర్షన్‌లను ప్రభావితం చేస్తాయి. 


Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?


ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌డేట్‌లో ఐదు తీవ్రమైన లోపాలు
గూగుల్ తెలుపుతున్న దాని ప్రకారం హ్యాకర్లు మీ ఫోన్‌ను దూరం నుంచి నియంత్రించగల కొన్ని తీవ్రమైన లోపాలను కూడా ఈ అప్‌డేట్ పరిష్కరించింది. ఈ లోపాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా హ్యాకర్లు ఫోన్‌లో మాల్వేర్‌ను చొప్పించవచ్చు. ఆ తర్వాత మీ ఫోన్ హ్యాకర్ల ఆధీనంలోకి వస్తుంది. సెక్యూరిటీ అప్‌డేట్ ద్వారా ఆండ్రాయిడ్ ఐదు తీవ్రమైన లోపాలను ఈ కింద తెలిపిన విధంగా లేబుల్ చేసింది.


CVE-2024-43096
CVE-2024-43770
CVE-2024-43771
CVE-2024-49747
CVE-2024-49748


ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌డేట్: సిస్టంను ఎలా అప్‌డేట్ చేయాలి?
ఆండ్రాయిడ్ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ముందుగా మీరు ఫోన్ సెట్టింగ్స్‌కు వెళ్లి ఆపై 'సిస్టమ్'కి వెళ్లి 'సిస్టమ్ అప్‌డేట్'పై క్లిక్ చేయండి. మీ ఫోన్‌కు అప్‌డేట్ అందుబాటులో ఉంటే, మీరు దానిని ఇక్కడ చూస్తారు. అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత దానిని ఇన్‌స్టాల్ చేయడానికి స్క్రీన్‌పై ఇచ్చిన సూచనలను ఫాలో అవ్వండి.



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!