Amitabh Bachchan uses Apple Vision Pro: ప్రపంచంలో టెక్నాలజీ గురించి మాట్లాడేటప్పుడు యాపిల్ గురించి మాట్లాడకుండా ఉంటే ఎలా? యాపిల్ కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేసిందంటే దాని గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. గతేడాది కూడా యాపిల్ ఇలాంటి ప్రొడక్ట్‌నే మార్కెట్లో లాంచ్ చేసింది. అదే యాపిల్ విజన్ ప్రో. దీన్ని కంపెనీ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 ఈవెంట్లో లాంచ్ చేసింది. ఏఆర్, వీఆర్ టెక్నాలజీతో దీన్ని డిజైన్ చేశారు. ఇప్పుడు యాపిల్ విజన్ ప్రో గురించి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా మాట్లాడారు.


ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు షేర్
అమితాబ్ బచ్చన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి ఒక ఫొటోని షేర్ చేశారు. అందులో ఆయన యాపిల్ విజన్ ప్రో ధరించి కనిపించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ యాపిల్ ఉత్పత్తిని ట్రై చేశారు. ఆయనకు అది విపరీతంగా నచ్చేసింది. వెంటనే ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో దీని గురించి షేర్ చేస్తున్నారు.






ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌లో అమితాబ్ బచ్చన్ ‘వావ్... ది యాపిల్ విజన్ ప్రో... నిజంగా అద్భుతం... దీన్ని పెట్టుకుంటే మీ వీక్షణ అనుభవం ఇంతకు ముందులా ఉండదు. అభిషేక్ ఇప్పుడే దీన్ని నాకు పరిచయం చేశాడు.’ అని పోస్ట్ చేశారు.


యాపిల్ విజన్ ప్రో ధర ఎంతగా నిర్ణయించారు?
అమెరికాలో యాపిల్ విజన్ ప్రో ధర 3,499 డాలర్లుగా (మనదేశ కరెన్సీలో రూ.2,92,000) నిర్ణయించారు. అమెరికాలో ఇది ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. కానీ మనదేశంలో యాపిల్ విజన్ ప్రో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.


యాపిల్ విజన్ ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఈ మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్లో రెండు మైక్రో ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ విజన్ ప్రో 23 మిలియన్ పిక్సెల్స్‌ను సపోర్ట్ చేయనుంది. ఇందులో అందించిన కస్టం 3డీ లెన్స్ ద్వారా ఏఆర్ కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. హై స్పీడ్ ప్రధాన కెమెరాలు ఉన్న ఫుల్ సెన్సార్లు, హ్యాండ్ ట్రాకింగ్ కోసం కింద వైపు కెమెరాలు, ఐఆర్ ఇల్యూమినేటర్లు, సైడ్ కెమెరాలు ఇలా ఫుల్లీ ఎక్విప్డ్‌గా ఇది మార్కెట్లోకి వచ్చింది. హ్యాండ్ ట్రాకింగ్ కోసం, డివైస్ కింద స్పేస్ కోసం ప్రత్యేకంగా లిడార్ స్కానర్, ట్రూడెప్త్ కెమెరాలు కూడా అందించారు. రెండు ప్రత్యేకమైన యాంప్లిఫైడ్ డ్రైవర్స్ ద్వారా స్పేషియల్ ఆడియోను అందించనున్నట్లు యాపిల్ అధికారికంగా తెలిపింది.


Read Also: ఎండలతో సతమతమవుతున్న జనాలకు కూల్ న్యూస్, సోనీ నుంచి సరికొత్త పాకెట్ ఏసీ వచ్చేస్తోంది!


యాపిల్ పవర్ ఫుల్ ఎం2 చిప్‌, ఆర్1 చిప్‌లపై యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ రన్ కానుంది. ఈ ఏఆర్/వీఆర్ హెడ్‌సెట్లో 12 కెమెరాలు, ఐదు సెన్సార్లు, ఆరు మైక్రో ఫోన్లను సపోర్ట్ చేస్తుందని యాపిల్ అధికారికంగా తెలిపింది. కంటికి సైట్ ఉన్న యూజర్లు కూడా దీన్ని ఉపయోగించేందుకు జీస్ ఆప్టికల్ ఇన్‌సెర్ట్స్‌ను యాపిల్ ఇందులో అందించింది.


వినియోగదారుల ఐరిస్‌ను గుర్తించేలా యాపిల్ విజన్ ప్రోలో ఆప్టిక్ ఐడీ ఫీచర్‌ను కూడా కంపెనీ అందించింది. ఐఫోన్‌ను ఫేస్ ఐడీతో మాత్రమే ఎలా అన్‌లాక్ చేయగలమో, యాపిల్ విజన్ ప్రోను ఆప్టిక్ ఐడీతో మాత్రమే అన్‌లాక్ చేయగలం. ఈ హెడ్‌సెట్ విజన్ఓఎస్ అనే ప్రత్యేకమైన ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. రియల్ టైమ్ సబ్ సిస్టం, స్పేషియల్ ఆడియో ఇంజిన్, మల్టీ యాప్ 3డీ ఇంజిన్ వంటి ఫీచర్లు యాపిల్ ఈ హెడ్‌సెట్‌తో అందించనుంది. 


Read Also: ‘మదర్స్ డే’ గిఫ్ట్ ఐడియాస్ - ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్స్‌తో అమ్మను సర్ ప్రైజ్ చెయ్యండి!