అమెరికాలోని జార్జియాకు చెందిన క్రాఫోర్డ్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌ కంపెనీకే చెమట్లు పట్టించాడు. తన ఖాతాను యాక్సెస్ చేయడం కుదరకపోవడంతో ఫేస్‌బుక్‌పై కేసు పెట్టి 50 వేల డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.41.11 లక్షలు) జరిమానా విధించేలా చేశాడు. సరైన కారణం చెప్పకుండా తన ఖాతాను టెర్మినేట్ చేయడంతో పాటు, సమస్యపై స్పందన కూడా లేకపోవడంతో 2022లో అతను ఈ కేసు పెట్టాడు.


‘ఒక ఆదివారం ఉదయాన్నే లేచాను. ఫేస్ బుక్ అకౌంట్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే అది లాక్ అయింది. నన్ను బ్యాన్ చేశానని తెలిపారు. చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కారణంగా నన్ను లాక్ చేసినట్లు చిన్న స్నాప్‌షాట్ ద్వారా తెలిపారు. తర్వాత అది కూడా పోయింది.’ అని క్రాఫోర్డ్ తెలిపాడు.


కానీ ఆ వ్యక్తి ఎప్పుడూ అటువంటివి చేయలేదని తెలిపాడు. దీంతోపాటు ఫేస్ బుక్ కూడా రూల్స్ ఎందుకు వయొలేట్ చేశాడో తెలపలేదు. ఈ సమస్య పరిష్కారం కోసం ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటాను చేరుకోవడానికి అతను చాలా సార్లు ప్రయత్నించాడు. కానీ అతనికి అస్సలు ఒక్కసారి కూడా సమాధానం రాలేదు.


గతంలో కూడా అతని ఖాతాపైన పొలిటికల్ కామెంట్స్ విషయంలో వయొలేషన్ పడింది. కానీ ఈసారి పూర్తిగా ఫేస్ బుక్ ప్రొఫైల్ నుంచి కూడా రిస్ట్రిక్ట్ చేశారు. దీంతో అతను కోర్టును ఆశ్రయించాడు. ‘ఇది బిజినెస్ చేసే పద్ధతి కాదు. ప్రజలను ఇలా ట్రీట్ చేయకూడదు. కనీసం నేనేం తప్పు చేశానో అయినా తెలపాలి కదా.’ అని క్రాఫోర్డ్ వాపోయాడు.


ఫేస్‌బుక్ నుంచి సమాధానం రాకపోవడంతో వృత్తిరీత్యా లాయర్ అయిన క్రాఫోర్డ్ 2022 ఆగస్టులో నేరుగా కేసు పెట్టాడు. అయినా సరే ఫేస్‌బుక్ నుంచి సమాధానం రాలేదు. అయితే ఫేస్‌బుక్ లీగల్ టీమ్ ఈ లా సూట్‌కి సమాధానం ఇవ్వలేకపోయింది. దీంతో క్రాఫోర్డ్‌కు 50 వేల డాలర్లు చెల్లించాల్సిందిగా మెటాను కోర్టు ఆదేశించింది. అయితే క్రాఫోర్డ్ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే మెటా తన ఫేస్‌బుక్ ఖాతాను రీస్టోర్ చేసింది కానీ జరిమానా ఇంకా చెల్లించలేదు.


ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా భారతదేశంలో వెరిఫైడ్ అకౌంట్ సర్వీస్‌ను ప్రారంభించింది. అంటే మీరు మీ ఖాతాను వెరిఫైడ్ అకౌంట్‌గా బ్లూటిక్‌తో చూసుకోవాలనుకుంటే ఈ సదుపాయాన్ని తీసుకోవచ్చు. ఇందుకోసం మీరు ప్రతి నెలా రూ.699 సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ప్రస్తుతం ఈ ఫీచర్ మొబైల్ యాప్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో వెబ్ వెర్షన్‌లో కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.


వెబ్ వెర్షన్ ప్రారంభమైనప్పుడు వినియోగదారులకు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ. 599 అందించబడుతుంది. భారతదేశంలోని వినియోగదారులు ప్రస్తుతం iOS, ఆండ్రాయిడ్‌లలో నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ. 699 తీసుకోవచ్చని మెటా తెలిపింది. ఫేస్‌బుక్ వెరిఫైడ్ అకౌంట్ సబ్‌స్క్రిప్షన్ కోసం, Facebook, Instagram వినియోగదారులు ప్రభుత్వ ఐడీతో తమ ఖాతాను వెరిఫై చేయాల్సి ఉంటుంది.


వెరిఫై చేసిన ఖాతాకు భద్రత, మద్దతు లభిస్తుందని కంపెనీ తెలిపింది. "ప్రపంచంలోని అనేక దేశాలలో మా ప్రారంభ పరీక్షల నుంచి అద్భుతమైన ఫలితాలను చూసిన తర్వాత మేం మెటా వెరిఫైడ్ సర్వీస్ టెస్టింగ్‌ను భారతదేశానికి విస్తరిస్తున్నాం." అని మెటా తెలిపింది.


ఇప్పటికే ఉన్న ప్రమాణాల ఆధారంగా గతంలో అందించిన వెరిఫికేషన్ బ్యాడ్జ్‌లను గౌరవించడం కూడా కొనసాగిస్తాం. ఫేస్‌బుక్ వెరిఫైడ్ అకౌంట్ పొందాలంటే కొన్ని షరతులు ఉండాలి. వినియోగదారులు తప్పనిసరిగా కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.


Read Also: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?