ఇంటర్నెట్ రాకతో ప్రస్తుతం అంతా మారిపోయింది. ఇంతకు ముందు సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లేవారు. కానీ ఓటీటీ ప్లాట్‌ఫాం వచ్చిన తర్వాత ఇప్పుడు అంతా మారిపోయింది. ఓటీటీ ద్వారా ఇంట్లోనే కూర్చుని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఆస్వాదించవచ్చు. అమెజాన్ ప్రైమ్‌కు దేశవ్యాప్తంగా మంచి సబ్‌స్క్రైబర్ బేస్ ఉంది.


ఇప్పుడు అమెజాన్ 'ప్రైమ్ లైట్' అనే చవకైన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కంపెనీ పరీక్షిస్తోంది. ఈ ప్లాన్ రూ.999గా ఉంటుంది. ఒకప్పుడు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధర రూ.999గా ఉండేది. కానీ 2021 డిసెంబర్‌లో కంపెనీ ధరను పెంచింది. ఈ ప్లాన్ ధరను రూ.1499కి పెంచారు. ప్రైమ్ లైట్ ద్వారా మరో చవకైన ప్లాన్‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌ను రూ.999కే లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే ఇందులో కొన్ని లాభాలను కంపెనీ తగ్గించనుంది.


అమెజాన్ ప్రైమ్ లైట్ ద్వారా మీకు లభించే లాభాలు ఇవే...
1. ఈ ప్లాన్ ద్వారా ఎస్‌డీ రిజల్యూషన్‌లో వీడియోలను స్ట్రీమ్ చేసే అవకాశం లభిస్తుంది. దీన్ని కేవలం ఒకేసారి రెండు డివైస్‌ల్లో మాత్రమే ఉపయోగించగలరు. ఇందులో మీరు లైవ్ స్పోర్ట్స్ చూడలేరు.
2. మీరు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
3. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా రెండు రోజుల పాటు అన్‌లిమిటెడ్ ఫ్రీ షిప్పింగ్‌ను పొందుతారు.
4. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌లో ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ గేమింగ్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ప్రయోజనాలు ఉండవు.


టీవీలో కూడా ఉపయోగించవచ్చు
అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు దీన్ని మొబైల్‌లో, స్మార్ట్ టీవీ లేదా కంప్యూటర్‌లో ఉపయోగించవచ్చు. ఇది కేవలం మొబైల్ మాత్రమే ప్లాన్ కాదు. ప్రస్తుతం ఈ ప్లాన్ బీటా టెస్టింగ్ జరుగుతోంది. ఇది ప్రస్తుతం కొంతమంది వినియోగదారులకు అందుబాటులో ఉంది. రానున్న కాలంలో కంపెనీ ఈ ప్లాన్‌ని అందరికీ అందించనుంది.