ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) వార్షిక 'ప్రైమ్ డే సేల్'లో భాగంగా సరికొత్త ఆఫర్లను ముందుకు తీసుకొస్తోంది. నేటి నుంచి రెండు రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు సహా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో కలిసి 10 శాతం రాయితీ కల్పించనుంది. ఇక ఈసారి 'అడ్వాంటేజ్- జస్ట్ ఫర్ ప్రైమ్' పేరిట ప్రైమ్ ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది.
అమెజాన్ (Amazon) ప్రైమ్ డే సేల్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై ప్రకటించిన ఆఫర్లు ఇలా ఉన్నాయి.
- ఐక్యూ జెడ్3 5జీ ఫోన్‌పై సుమారు రూ.1,500 కూపన్ డిస్కౌంట్ లభించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిస్కౌంట్‌తో ఈ ఫోన్ రూ.17,000లకు రానుంది.
- షియోమీ ఎంఐ 10ఐ 5జీ స్మార్ట్ఫోను ఎక్సేంజ్ ఆఫర్ రూ.3000 తగ్గింపుతో రూ. 20 వేల లోపు రానుంది.
- వన్‌ప్లస్ నోర్డ్ 2 5జీ ఫోన్‌పై వేయి రూపాయిల అడిషినల్ డిస్కౌంట్ లభించనుంది. అంతేగాకుండా ప్రైమ్‌డే నాడు ఈ ఫోన్ సూమారుగా రూ. 30వేలకు రానుంది.
- వన్‌ప్లస్ 9ఆర్ 5జీ ఫోన్‌పై వినియోగదారులకు కూపన్స్పై నాలుగు వేల రూపాయిలు ఎక్సేంజ్ ఆఫర్ కింద మరో 5వేల రూపాయిలు తగ్గనున్నాయి.
- వన్‌ప్లస్ నోర్డ్ సీఈ 5జీ మొబైల్ ఫోన్‌పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిస్కౌంట్ కింద వేయి రూపాయిలు ఆఫర్ లభించనుంది. అంతేకాకుండా జియో వినియోగదారులు సుమారు రూ. 6వేల వరకు లబ్ధిపొందనున్నారు.
- రెడ్మీ నోట్ 10టీ 5జీ ఫోన్ ప్రైమ్‌డే నాడు రూ.13,999లకు లభించనుంది.
- శాంసంగ్ గెలాక్సీ ఎం42 5జీపై సుమారు రూ. 10వేల వరకూ కూపన్ ఆఫర్స్ పొందగలుగుతారు.
Redmi Note 10 Pro Max:
ఈ ఫోన్ 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.19,999గా ఉంది. అయితే.. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ లభించనుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 6.67 అంగుళాల Full-HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. 5,020mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఇంకా ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.
ఇవేకాక ఇతర బ్రాండ్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు సహా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్లు ఉన్నాయి.
కొత్తగా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకునేవారికి సైతం అమెజాన్ (Amazon) ఆఫర్లు ప్రకటించింది. సంవత్సరానికి రూ.999, మూడు నెలలకు రూ.329గా సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను నిర్ణయించింది. ఇక 18-24 ఏళ్ల యువకులకు 'యూత్ ఆఫర్' కింద సబ్‌స్క్రిప్షన్ ధరలో 50శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ప్రైమ్‌కు సైన్ అప్ అయిన తర్వాత వయసును ధ్రువీకరించి వెంటనే 50శాతం క్యాష్‌బ్యాక్ పొందడం ద్వారా ఈ ఆఫర్‌ను సొంతం చేసుకుకోవచ్చు.