Best Mobile Offers in Amazon Flipkart: అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌, ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ సేల్‌ ప్రారంభానికి సిద్ధమైంది.  ప్రైమ్‌ మెంబర్లు, ప్లస్‌ మెంబర్లకైతే ఒకరోజు ముందు సెప్టెంబర్‌ 26 నుంచే అందుబాటులోకి వచ్చేశాయి. అయితే ఈ ఫెస్టివల్​ సేల్, బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​లో  స్మార్ట్‌ ఫోన్లపై డిస్కౌంట్లు ఉండటం, అతి తక్కువ ధరకే దొరకడంతో వీటిని కొనుగోలు చేసేందుకు చాలా మంది కొనుగోలుకు సన్నద్ధమవుతుంటారు. మరి  మీరూ కూడా ఈ సేల్స్‌లో బడ్జెట్​ ఫ్రెండ్లీతో సూపర్ ఫీచర్స్​ స్మార్ట్​ ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అందుకోసమే  బడ్జెట్‌ స్ట్రిక్ట్‌గా రూ.10వేలు, రూ.15వేల్లోపు  ఫోన్లను మీ ముందుకు తీసుకొచ్చాం. 


రూ.10వేలలోపు స్మార్ట్ ఫోన్లు ఇవే - ఈ సేల్‌లో మోటొరొలా జీ34 5జీ  ఫోన్‌  రూ.9,999కే దొరకనుంది. 6.5 ఇంచ్​ హెచ్‌డీ + డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌తో నడుస్తుంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కెపాసిటీ. 8జీబీ వేరియంట్‌ను కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. 


శాంసంగ్‌ ఏ14 5జీ కూడా బెస్ట్ ఆప్షన్.  6.6 ఇంచ్​ ఫుల్ హెచ్‌డీ + డిస్‌ప్లే, 50 ఎంపీ కెమెరా ఉంటుంది.  5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి  ఉంది. ఛార్జర్‌ వేరేగా కొనుగోలు చేయాలి. ఈ సేల్‌లో రూ.9,999కే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. 


రెడ్‌మీ 13సీ 5జీ ఫోన్‌  మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 6100 + ప్రాసెసర్‌తో నడుస్తుంది. 50 ఎంపీ ఏఐ డ్యూయల్‌ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ కూడా ఉన్నాయి. ఇది  కూడా రూ.10 వేలు లోపే దొరుకుతుంది. అమెజాన్‌ ఇది రూ.8,999కే అందుబాటులో ఉంది. 


ఐకూ జడ్‌ 9 లైట్‌  మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 6,300 ప్రాసెసర్‌తో నడుస్తుంది. 50 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వచ్చింది. అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ రూ.9,499కే దొరకుతుంది.


రూ.15వేలు లోపు బెస్ట్ స్మార్ట్​ ఫోన్లు ఇవే - మోటోరొలా జీ64 5జీ స్మార్ట్ ఫోన్​ను ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో రూ.13,999కే సొంతం చేసుకోవచ్చు.   6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ + ఎల్‌సీడీ డిస్‌ప్లే దీని ప్రత్యేకత. 50 ఎంపీ కెమెరా, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇందులో ఉన్నాయి. 


శాంసంగ్‌ ఎం35 5జీ 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఎగ్జినోస్‌ 1380 ప్రాసెసర్‌తో వచ్చింది.  50 ఎంపీ కెమెరా దీని ప్రత్యేకత. ఛార్జర్‌ వేరేగా కొనుగోలు చేయాలి. అమెజాన్‌లో ఈ ఫెస్టివల్  సేల్‌లో రూ.13,749కే యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.  


వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4లా ఉండే ఒప్పో కే12ఎక్స్‌ కూడా రూ.10,999కే దొరుకుతోంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయొచ్చు.  డ్యామేజ్‌ ప్రూఫ్‌ బాడీ ఈ స్మార్ట్ ఫోన్ స్పెషాలిటీ.  6.67 ఇంచ్​ హెచ్‌డీ డిస్‌ప్లే, 32 ఎంపీ కెమెరా ఉన్నాయి. అలాగే 5100 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఉంది. 


ఇక కర్వ్‌ ఫోన్‌ కొనాలని అనుకునే వారి కోసం లావా బ్లేజ్‌ కర్వ్‌ బాగుంటుంది. అమెజాన్‌లో ప్రస్తుతం రూ.14,499కే ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తోంది. 6.67 ఇంచ్​ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది.  64 ఎంపీ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా ఉన్నాయి. 


రియల్‌మీ నుంచి 3 ఫోన్లు రూ.15వేలలోపు ఉన్నాయి.  గేమింగ్‌ ప్రియులకు  రియల్‌మీ నార్జో 70 టర్బో మంచి ఆప్షన్.  ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.  రూ.14,999కు సొంతం చేసుకోవచ్చు. అదే బెస్ట్​ కెమెరా కావాలి అంటే నార్జో 70 ప్రో  రూ.14,999కు అమెజాన్​లో లభిస్తుంది.  రియల్‌మీ నార్జో 70 ఎక్స్‌ కూడా మంచి ఫోన్ అని చెప్పొచ్చు.