అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో ఎన్నో ఉత్పత్తులపై ఆఫర్లు లభించిన సంగతి తెలిసిందే. అయితే మంచి కెమెరా ఫోన్ కావాలనుకునేవారికి ఇది మంచి డీల్. రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్‌పై ఈ సేల్‌లో అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.15 వేలలోపు ధరకే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అదనంగా రూ.300 తగ్గింపు లభించనుంది. కేవలం కెమెరా మాత్రమే కాకుండా పెద్ద స్క్రీన్, వేగవంతమైన ప్రాసెసర్, పవర్ ఫుల్ బ్యాటరీని కూడా ఇందులో అందించారు.


అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి


ఈ ఫోన్ అసలు ధర రూ.22,999 కాగా, రూ.4,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందించారు. అంటే రూ.18,999కే ఈ సేల్ అందుబాటులో ఉంది. అయితే యాక్సిస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, సిటీ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,250 తగ్గింపు లభించనుంది. దీంతో ఈ ఫోన్ ధర రూ.17,749కి తగ్గనుంది. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు రూ.300 అదనపు తగ్గింపు లభించనుంది.


దీంతోపాటు మీ పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా కొంటే ఇంకా తగ్గింపు లభించనుంది. అంటే రూ.15 వేలలోపుకే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చన్న మాట. అంతేకాకుండా దీనిపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. అంటే ప్రతి నెలా ఎటువంటి వడ్డీ లేకుండా మీరు పేమెంట్ చేయవచ్చన్న మాట. 


రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫీచర్లు
ఇందులో 6.67 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇందులో ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంకా పెంచుకునే అవకాశం ఉంది.


ఇక కెమెరాల విషయాల వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ కెమెరాలో నైట్ మోడ్ 2.0, వ్లాగ్ మోడ్, మ్యాజిక్ క్లోన్ మోడ్, లాంగ్ ఎక్స్‌పోజర్ మోడ్, వీడియో ప్రో మోడ్, డ్యూయల్ వీడియో వంటి ఫీచర్లు ఉన్నాయి.


4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఇన్‌ఫ్రారెడ్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5020 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.81 సెంటీమీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.


రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి